28.7 C
Hyderabad
May 6, 2024 07: 06 AM
Slider హైదరాబాద్

ల్యాండ్ మాఫియా అడ్డా నరేంద్రనగర్ కాలనీ

land mafia

అనేక అవసరమైన కూరగాయలు, వారాంతపు సంతలు జరిగే సాంప్రదాయం అందరికి తెలిసిన విషయమే. అలాగే నరేంద్రనగర్ కాలనీలో వారాంతం శని, ఆదివారాలు వచ్చేవరకు భూముల క్రయ విక్రయ దళారులు, కొనుగోలు చేసేవారు సమావేశమై వారి వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ సందడి చేస్తూ ఉంటారు. ఇది చాలదన్నట్లు ల్యాండ్ మాఫియా జనం కొంతమంది ఇక్కడ పర్యటిస్తూ కొందరు ప్లాట్ల యజమానులను కలసి మీరు ఉంటున్న స్థలాలు మేము కొన్నాము ఆ స్థలాల డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయి. మరల మీ వద్దకు వస్తాము. ఈ లోగా మీరు ఆ స్థలాలను ఖాళీ చేయండి లేదా ఈ స్థలాలు మీవని ఏమైనా ఆధారాలు ఉంటే ఆ కాగితాలు మాకు చూపించండి అని దౌర్జన్యం చేస్తున్నారు. ఒకవేళ మా వద్ద ఉన్నకాగితాలు చూపిస్తే వాటిని ఫొటోలు తీసుకుంటున్నారు. మచ్చుకి ఇలాంటి విషయమే ఈ కాలనీలో తేదీ:17/11/2020 మంగళవారం “డి” బ్లాకు ప్లాటు నంబరు 234 లో తెలియని ఆగంతకులు వచ్చి దౌర్జన్యంతో స్థలం జిరాక్సు కాగితాలను ఫొటోలు తీసుకుని వెళ్ళారు. ఆ సమయములో కాని అసలు సంగతి ఏమిటో తెలియక ఆందోళనతో చుట్టుప్రక్కల వారికి జరిగిన సమాచారం తెలియపరచలేకపోయాం. ఈ ఉద్రిక్తల కారణంగా కాలనీలో ప్రశాంతతకు అవరోధం కలుగుతున్నది.

కాబ‌ట్టి ప్రభుత్వం లాండ్ మాఫియాల పట్ల కఠిన చర్యలు చేపట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ఈ లాండ్ మాఫియా నియంత్రణ కోసం పోలీసు శాఖ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిబ్లాకుకు చెందిన జ్యోతి నిర్మ‌ల కోరుతున్నారు.

Related posts

పనిష్ మెంట్: నిజం చెప్పిన డాక్టర్ పై బదిలీ వేటు

Satyam NEWS

మండలి రద్దు అవుతుందా?: వైసీపీ ఎమ్మెల్సీల గుండెల్లో రైళ్లు

Satyam NEWS

పెద్ద మనసుతో పేదలకు నిత్యావసరాలు పంచిన టీచర్లు

Satyam NEWS

Leave a Comment