28.2 C
Hyderabad
May 9, 2024 00: 08 AM
Slider ప్రత్యేకం

మండలి రద్దు అవుతుందా?: వైసీపీ ఎమ్మెల్సీల గుండెల్లో రైళ్లు

#Y S Jagan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ సి ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. శాసన మండలి ఎప్పుడు రద్దు అవుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారి గుండెల్లో గుబులు పట్టుకున్నది. మూడు రాజధానుల బిల్లును ఆమోదించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌన్సిల్ రద్దుకు సిఫార్సు చేశారు.

రాబోయే రోజుల్లో కౌన్సిల్ లో తమకే ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని ఎందరు చెప్పినా ఆయన వినలేదు. తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉన్న కౌన్సిల్ ను రద్దు చేయాల్సిందేనని ఆయన పట్టుపట్టి కేంద్రానికి ప్రతిపాదన పంపారు. తర్వాత జరిగిన పరిణామాలలో కౌన్సిల్ లో వైసీపీకి మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు అందరూ రిటైర్ అయ్యారు.

ప్రస్తుతం వైసీపీకి 21 మంది సభ్యులు ఉండగా మండలి చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవి కూడా వైసీపీకే దక్కబోతున్నాయి. ఇంకో 9 స్థానాలు స్థానిక సంస్థల నుంచి మూడు స్థానాలు ఎమ్మెల్యేల కోటా నుంచి మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. అవి కూడా వైసీపీ ఖాతాలోకే చేరబోతున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నేడు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో మండలి రద్దుపై పంపిన ప్రతిపాదనలు ఏమయ్యాయని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సమాధానమిస్తూ కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు.

మండలి రద్దు ప్రతిపాదనలు కేంద్రం చేతిలో ఉన్నట్లు ఆయన చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్సీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మెజారిటీ వచ్చినా తాము మండలి రద్దుకే కట్టుబడి ఉన్నామని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోదని వారు భావించారు. అయితే అకస్మాత్తుగా కేంద్రం తన వైఖరిని ప్రకటించడంతో వారు హతాశులవుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన తర్వాత గత 60 ఏళ్లలో ఒక్క సారి కూడా కేంద్రం తిరస్కరించలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరిన కోరికను మన్నించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్రం పరిశీలనలో ఉన్నది అని మంత్రి సమాధానం చెప్పినందున అతి త్వరలోనే మండలి రద్దు అవుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.

మండలి రద్దు చేయాలని తీర్మానం కేంద్రానికి పంపిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలను ఎంపిక చేస్తూనే ఉన్నారు. చివరికి గవర్నర్ కోటా లో కూడా ఎమ్మెల్సీ లను భర్తీ చేశారు. ఇప్పుడు మండలి రద్దు చేయవద్దు అంటూ మళ్లీ మడం తిప్పి మరో సారి తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం రెండో తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటుందో లేదో ప్రశ్నార్ధకమే.  

Related posts

పోరుమామళ్ల వద్ద 23ఎర్రచందనం దుంగలతో 5గురు అరెస్టు

Satyam NEWS

ఎమ్మెల్యేకు, పోలీసులకు మాజీ మంత్రి జూపల్లి వార్నింగ్

Satyam NEWS

కరోనా కాలంలోనూ భారీగానే మల్లన్న హుండీ ఆదాయం

Satyam NEWS

Leave a Comment