30.7 C
Hyderabad
April 29, 2024 04: 47 AM
Slider ప్రత్యేకం

పనిష్ మెంట్: నిజం చెప్పిన డాక్టర్ పై బదిలీ వేటు

gandhi doctor

కరోనా వైరస్ విజృంభిస్తున్నదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన ఒక డాక్టర్ ను అకస్మాత్తుగా బదిలీ చేసి శిక్షించారు తప్ప ఆయన చెప్పిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న పద్ధతులను ప్రశ్నిస్తే సరిచేసుకోవాల్సింది పోయి ప్రశ్నించిన వారిని శిక్షిస్తున్నారు. ఏమిటి ఇది?

ఇదేనా తెలంగాణ లో హెల్త్ కేర్? కరోనా వైరస్ రోగులకు  కనీస వసతులు లేవు అని వాస్తవాలు వివరించినందుకు గాంధీ హాస్పిటల్ డాక్టర్ వసంత్ పై చర్యలు తీసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం గాంధీ లో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని మీడియా కు తప్పుడు సమాచారం ఇచ్చారని డాక్టర్ వసంత్ పై ఆరోపణ చేస్తున్నారు. దీంతో  మనోవేదనకు గురైన డాక్టర్ వసంత్ ఈరోజు పెట్రోల్ డబ్బాతో గాంధీ హాస్పిటల్ కు  వచ్చారు.

తాను చెప్పే మాటలు వినడం లేదని, అటు రోగులు ఇటు వైద్యులు, గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పినా ఉన్నతాధికారులు వినడం లేదని డాక్టర్ వసంత్ అంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో చక్కగా రోగులకు వైద్యం చేసే డాక్టర్ వసంత్ ను హెల్త్ డిపార్ట్ మెంటులో పరిపాలనా విభాగానికి బదిలీ చేశారు. ఇదీ తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు.

Related posts

ఏజన్సీ లో మెగా వైద్య శిబిరం

Murali Krishna

మాస్క్ లేకుండా షాపు నడిపే యజమానికి భారీ జరిమానా

Satyam NEWS

వి ఎస్ యూ ఆధ్వర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్

Bhavani

Leave a Comment