29.7 C
Hyderabad
May 3, 2024 03: 34 AM
Slider క్రీడలు

మహిళ క్రికెట్ కోచ్ గా సర్టిఫికెట్ సాధించిన లాస్య

#V. Srinivas Goud

మహిళ క్రికెట్ కోచ్ గా ICC – అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సు లో Leval -1 సర్టిఫికెట్ సాధించిన బుర్రా లాస్య ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా మహిళ క్రికెట్ కోచ్ గా ICC – అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సు లో Leval -1 సర్టిఫికెట్ సాధించిన బుర్రా లాస్య తండ్రి బుర్రా రమేష్ గౌడ్ ( భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్) ను మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ లో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. అలాగే, క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తన్నామన్నారు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్.

ICC లో బుర్రా లాస్య Leval – 1 క్రికెట్ కోచ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా కోచ్ గా చరిత్ర సృష్టించినందుకు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ లాస్య ను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Related posts

లోకేశ్వరి, పురందేశ్వరి ఆవిష్కరించిన మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్

Satyam NEWS

త్వరలో విజయ డెయిరీ విస్తరణ

Satyam NEWS

దేశంలో తగ్గిపోయిన రాష్ర్టాల సంఖ్య

Satyam NEWS

Leave a Comment