30.2 C
Hyderabad
September 14, 2024 17: 01 PM
Slider జాతీయం ప్రత్యేకం

దేశంలో తగ్గిపోయిన రాష్ర్టాల సంఖ్య

Jammu and Kashmir

దేశంలో రాష్ట్రాల సంఖ్య పెరగాలి. అయితే విచిత్రంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలుగా విడగొట్టి జమ్మూ కాశ్మీర్ లకు అసెంబ్లీ ఉండే కేంద్ర పాలిత ప్రాంతంగా, లడక్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. అంటే అక్కడ రాష్ట్రం రద్దు అయింది. ​​2014కి ముందు దేశంలో 28 రాష్ట్రాలు ఉండేవి. తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రాల సంఖ్య 29కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ 28కి చేరింది. జమ్ముకాశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాల సంఖ్య తగ్గి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభ బిల్లు ప్రవేశపెట్టి నెగ్గించుకున్నారు. లోక్ సభలో బిల్లు నెగ్గడం చాలా సులభం ఎందుకంటే అక్కడ బిజెపికి మెజారిటీ ది. అందువల్ల ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది చరిత్రే. ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రం తాము అనుకున్న విధంగా పురోగమిస్తే మళ్లీ రాష్ట్రం హోదా ఇచ్చే విషయం పరిశీలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభ లో వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ​ఇప్పటివరకు కాశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కాశ్మీర్‌, లడక్ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కాశ్మీర్‌లో 10, లడక్ లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో కూడిన లడక్  రీజియన్‌ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కాశ్మీర్‌ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.

Related posts

పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్న విజయనగరం కొత్త క‌లెక్ట‌ర్

Satyam NEWS

బాడ్ టైం:టర్కీలో పడవ మునిగి 11 మంది జలసమాధి

Satyam NEWS

భద్రాచలం ఉద్యమకారుడి సైకిల్ యాత్ర

Murali Krishna

Leave a Comment