40.2 C
Hyderabad
May 6, 2024 18: 48 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో చేయి దాటి పోతున్న శాంతిభద్రతలు

#attack

రాయలసీమ పక్కనే ఉన్నా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకూ ఫ్యాక్షన్ గొడవలు లేవు. అయితే ఆ లోటు తీరుస్తూ టీఆర్ఎస్ లోని రెండు వర్గాలు సృష్టిస్తున్న గొడవలతో కొల్లాపూర్ ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా విధులు నిర్వహించే వారిని తప్పిస్తూ…చట్టాలను కాలరాసే వారిని పెంచి పోషిస్తున్నారు.

దాంతో చేయని తప్పులపై అక్రమ కేసులు బనాయించడం, అమాయకులపై దాడులు పెరిగిపోవడం జరుగుతున్నది. ఇప్పటి వరకూ రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉన్న వారిపై రౌడీ షీట్ లు తెరవడం, సస్పెక్ట్ షిట్ లు  ఓపెన్ చేయడం పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారు. పోలీసులు ఇలా చేయాల్సింది శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కదా! ఎవ్వరైతే ఏమి?  తప్పు చేసే వారికి పనిష్మెంట్ ఇస్తేనే శాంతి భద్రతలకు ఆటంకం జరగదు.

ఒకరికి ఒక లాగా మరొకరికి ఒక లాగా చట్టం అమలు అవుతే  మరిన్ని ఘోరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ…ఈరోజు వీరు అధికారంలో ఉండొచ్చు. రేపు మరొకరు ఉండొచ్చు కానీ ఇలాంటివి పునరావృతం కాకూడదు.. సామాన్యులే బాధలు అనుభవిస్తున్నారు. ప్రజలే ఒకరిని ఒకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దీనిపై కొల్లాపూర్ నియోజక వర్గ విద్యావంతులు, మేధావులు, ఉద్యోగుల బాధ్యత ఉన్నది.. ఒకసారి ఆలోచించండి.

ఇరు వర్గాల ఘర్షణలు ఎటు దారితీస్తాయో….?

ఈ ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో గమనించండి. సిన్సియర్ గా విధులు నిర్వహించే అధికారులు కూడా భయపడుతున్నారు..ఏ ప్రాంత కల్చర్ ఇక్కడికి వస్తుందో గమనించండి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎవరి వంతు వారు బాధ్యత వహించాలి. కొల్లాపూర్ మండలం మొల్ల చింతలపల్లి గ్రామంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి వర్గీయులు, మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు ఒక చిన్న విషయంలో చెలరేగిన ఘర్షణ విపరీత పరిణామాలకు దారితీస్తున్నది.

ఫ్యాక్షన్ ప్రాంతాలలో మాదిరిగా దెబ్బలు తిన్న వారిపైనే దౌర్జన్యం జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాగులో ఇసుకను రెగ్యులర్ గా తీసుకుని కొందరు అమ్ముకుంటున్నారు. వారిని అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే అధికారులను బెదిరించే స్థాయికి ఇసుక అక్రమ రవాణాదారులు వచ్చారు. తమ నాయకుడి పేరు చెప్పి కింది స్థాయి అధికారులను కూడా వారు బెదిరిస్తుంటారు.

గ్రామంలో కొందరు తమ పొలాలకు నీళ్ల కోసం గుంతలు తవ్వుకుంటున్నారు. ఇది చూసిన ఇసుక అక్రమ రవాణాదారులు ఆ గ్రామస్తులు ఇసుక తవ్వుతున్నారని అనుకుని వారితో తగాదా పెట్టుకున్నారు. కింది స్థాయి అధికారిని బలవంతం పెట్టి గుంతలు తవ్వుకునే వారిని ఆపాలని ప్రయత్నించారు. అయితే విషయం తెలిసిన ఆ అధికారి వారు తవ్వుతున్నది ఇసక కోసం కాదని, పొలాలను నీటి కోసం గుంతలు తీస్తున్నారని చెప్పినా ఇసుక అక్రమ రవాణాదారులు వినలేదు.

మా బండ్లు అయితే ఆపుతావు.. వాళ్లను ఆపవా అంటూ నానా దుర్భాషలాడారు. ఆ అధికారి సర్ది చెప్పేలోపునే వారు గ్రామస్తులపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఎట్టకేలకు పోలీసులు వచ్చి గుంపును చెదరగొట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇసుక అక్రమ రవాణాదారులు, గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలోనే వేరు వేరు వర్గాలకు చెందిన వారు కావడమే అసలు సమస్య. రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న పల్లెలను కూడా రణరంగంగా మారుస్తున్నారు.

Related posts

Analysis: బలం ఎక్కువ బుద్ధి తక్కువ

Satyam NEWS

తారకరత్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

Satyam NEWS

యాట కుమార్ బాటనే అందరూ నడవాలి

Bhavani

Leave a Comment