33.2 C
Hyderabad
May 3, 2024 23: 28 PM
Slider వరంగల్

ములుగు జిల్లాలో టీచర్లకు ఇంగ్లీష్ మీడియం బోధనకు శిక్షణ

#englishclass

సెకండరీ గ్రేడ్ టీచర్ లకు నిర్వహిస్తున్న ఆంగ్ల మాధ్యమ శిక్షణా శిబిరాన్ని ములుగు జిల్లా విద్యాశాఖాధికారి పాణిని నేడు సందర్శించారు. ప్రాథమిక, సెకండరీ స్థాయి లో గణితం, సాంఘీక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ  పెడుతున్నదని తెలిపారు. ఉపాద్యాయులు అందరు విధిగా ఐదు రోజుల పాటు ఆంగ్లమాధ్యమంలో  శిక్షణ కు హాజరు కావాలని చెప్పారు.

ఈ శిక్షణ ద్వారా ఉపాద్యాయులు ఆంగ్ల భాషలో నైపుణ్యం సాధించాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లం లో బోధన చేసేలా సిద్దంగా ఉండాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం ద్వారా భవిష్యత్తు లో ప్రభుత్వ పాశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. శిక్షణకు గైర్హాజరు ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి,MEO శ్రీనివాసులు, కుమార్, కందాల రామయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి, రవిప్రసాద్, శ్రీ రంగం , శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోహెడ్ పండ్ల మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించాలి

Satyam NEWS

కరోనా ఎలర్ట్: వ్యాధి నిరోధక ఆహారం తీసుకోవాలి

Satyam NEWS

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Murali Krishna

Leave a Comment