39.2 C
Hyderabad
April 28, 2024 12: 03 PM
Slider ప్రత్యేకం

శాంతి భద్రతలు చక్కగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి

#rachakondapolice

రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాచకొండ కమిషనరేట్ పనిచేస్తుందని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ వెల్లడించారు. గురువారం ఉప్పల్లో రాచకొండ ట్రాఫిక్ డిసిపి, ఏసిపి ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎసిపి నరేష్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసరావులతో కలిసి సందర్శించారు.

సిద్ధంగా ఉన్న నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించనున్నట్లు సిపి డిఎస్ చౌహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాచకొండ కమిషనరేట్ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కాలనీ సంఘాలు అందరితో కలిసి పని చేస్తామని, కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, ఎస్సైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మొదటిసారిగా ఉప్పల్  కు వచ్చిన సందర్భంగా సిపి డిఎస్ చౌహన్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, తది తర నాయకులు ఘనంగా సన్మానించారు.

Related posts

రైతు పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న పోలీసులు

Satyam NEWS

కొత్తగూడెం మున్సిపాలిటీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

పథకం ప్రకారమే అంతా చేశారు

Murali Krishna

Leave a Comment