33.7 C
Hyderabad
April 28, 2024 23: 40 PM
Slider ఆంధ్రప్రదేశ్

రైతు పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న పోలీసులు

guntur police

వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసు లో నిందితుడైన ఉమ్మనేని రాము ఎక్కడున్నాడు? తెలియదు. ఏ స్టేషన్లో ఉంచారు? తెలియదు. ఎన్ కౌంటర్ చేసేశారా? తెలియదు. ఇదీ అమరావతి రాజధాని రైతుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరి.

దారుణమైన మర్డర్లు చేసిన వారిని, మావోయిస్టులను, పాకిస్తాన్ ఉగ్రవాదులను కూడా ఇంత దారుణంగా చూడరు. కానీ ఏపి పోలీసులు మాత్రం అత్యంత అద్భుతంగా శాంతి భద్రతలను కాపాడుతున్నారు. జాతీయ రహదారి దిగ్బంధనం జరుగుతున్నదని తెలిసి కూడా స్పాట్ కు వైసిసి ఎమ్మెల్యే ఎందుకు వచ్చారనేదానికి ఎవరూ సమాధానం చెప్పరు కానీ ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన వారిని మాత్రం అరెస్టు చేసి ఎక్కడికో తీసుకెళ్లిపోతారు.

తాడికొండ వాసులకు సీతయ్య సినిమా చూపించారు పోలీసులు. జరిగిన క్రమం ఇది: తాడికొండ కి చెందిన ఉమ్మనేని రామును రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసిన తాడికొండ ఎస్ఐ రాజశేఖర్: 8 గంటలకు తాడికొండ నుంచి మంగళగిరి రూరల్ పోలిస్టేషన్ కు తరలింపు: 8.20 కిమంగళగిరి చేరుకున్న తాడికొండ గ్రామస్తులు: 8.30 గంటలకు ఎంపీ గల్లా, మాజీ మంత్రులు అడిగినా తెలియదు, ఇక్కడకు ఎవ్వరూ రాలేదని తెలిపిన మంగళగిరి పోలీసులు:

అప్పటికే అక్కడ నుంచి 9 గంటలకు గుంటూరు నల్లపాడు స్టేషన్ కు తరలింపు: 9.20 కి గుంటూరు బయలుదేరి న టిడిపి లీడర్లు: 9.55 గంటలకు టిడిపి నేతలు చేరుకునే సమయానికి అతనిని అక్కడ నుంచి మాయం చేసిన పోలీసులు: 10.50 నిమిషాలకు చేబ్రోలు స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న టిడిపి నేతలు: 11.10 చేబ్రోలు స్టేషన్ నుంచి మాయం చేసిన పోలీసులు, అక్కడా దొరకని  ఆచూకి…….ఉంచారా చంపేశారా? తెలీదు.

Related posts

ఖమ్మంకు ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అవార్డ్

Bhavani

తిరుమ‌ల‌లో తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం ఏర్పాటు

Satyam NEWS

ప్లాస్టిక్ భూతంపై నింజా మీడియా పోరాటం

Satyam NEWS

Leave a Comment