39.2 C
Hyderabad
May 3, 2024 13: 35 PM
Slider నల్గొండ

లీడర్ మేట్ వెబ్ పోర్టల్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

#Minister KTR

రాష్ట్రంలో తొలిసారిగా  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రజలకు చేరువయ్యే విధంగా రూపొందించిన “Leadermate” వెబ్ పోర్టల్ ను నియోజకవర్గ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి జన్మదినం సందర్భంగా TRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, IT శాఖ మంత్రి  కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి  ఈ వెబ్ పోర్టల్ గురించి వివరిస్తూ నియోజకవర్గంలో  జరుగుతున్న ప్రభుత్వ పథకాల వివరాలు, పట్టణ, గ్రామ స్థాయిలో అభివృద్ధి పనుల వివరాలు , CMRF , Party ఇన్సూరెన్స్ లబ్ధిదారుల వివరాలు, రక్తదాతల వివరాలు, నియోజవర్గ శాసనసభ్యుల రోజువారీ కార్యక్రమాల వివరాలు ఇందులో పొందు పరిచినట్లు చెప్పారు.

 అంతే కాకుండా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే విధంగా కూడా దీన్ని రూపొందించామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “సాంకేతికతను అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకుపోయే అవకాశం ఉంటుందని, ఈ “Leadermate” వెబ్ పోర్టల్  అన్ని రకాల ఉపయోగపడుతున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెబ్ పోర్టల్ డెవలపర్ విశాల్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యేను  కలిసిన టిఎన్జిఓ కొల్లాపూర్ యూనిట్ సభ్యులు

Satyam NEWS

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

Satyam NEWS

ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్ష

Murali Krishna

Leave a Comment