34.2 C
Hyderabad
May 14, 2024 22: 53 PM
Slider ముఖ్యంశాలు

ఈ లేడీ ఖతర్నాక్…జర జాగ్రత్త… సుమా…!

#vijayanagarampolice

మహిళలు… మహారాణులు..ఆడవాళ్లు… ఖతర్నాక్ లు.మీరు చదివినది నిజమే….అన్నింటిలో మగువలు మగాళ్ల ను మించిపోతున్నారు.చివరకు దొంగతనాల్లోనూ వారేమీ తక్కువగా లేదు. నమ్మశక్యంగా లేదా..? అయితే విజయనగరం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీసులు పట్టుకున్న లేడీ చరిత్ర తెలిస్తే…నిజమే అని నమ్మకతప్పరు.

విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఆటో లో ప్రమాణం చేసి తోటి ప్రయాణీకురాలిని మాటల్లో పెట్టి, ఏమార్చి, వారి బ్యాగును కటింగు చేసి, అందులో బంగారు ఆభరణాలు దొంగిలించిన మహిళను అరెస్టు చేసి, ఆమె నుండి ఏడుం పావు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లుగా  సీసీఎస్పో లీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పిఎస్ పరిధిలో గత నెల ఆటోలో ఒక ప్రయాణీకురాలు వెళ్తుండగా, అదే ఆటోలో వేరే ప్రాంతానికి వెళ్ళేందుకు ప్రయాణికురాలిగా మరో మహిళ ఎక్కి, ఆమెతో మాటలు కలిపి, ఆమె దృష్టి మరల్చి, ఆమె బ్యాగును కటింగ్ చేసి, బ్యాగులో ఉన్న 5 పేట్ల బంగారు గొలుసు, ఒక నల్ల పూసల దండ మరియు ఒక నెక్లెస్ ను దొంగిలించి, ఆటో దిగి వెళ్ళిపోయింది. తరువాత నగలు పోయినట్లుగా గుర్తించిన బాధితురాలు సాలూరు పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, సాలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసారు.

జిల్లా ఎస్పీ దీపిక, సీసీఎస్ మరియు సాలూరు పట్టణ పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, దర్యాప్తును ముమ్మరం చేసారు.

ఈ ప్రత్యేక బృందం నేరం జరిగిన మార్గంలోని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ లను పరిశీలించి, నేరంకు పాల్పడిన మహిళ పాత నేరస్థురాలుగా గుర్తించారు. సాలూరు పట్టణం చినబజారు మెయిన్ రోడ్డులో ఈ నౄల 7 నఒక మహిళ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న సీసీఎస్ మరియు సాలూరు పట్టణ పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని, ప్రశ్నించారు.

తన పేరు చింతా మౌనిక అలియాస్ మేకల మౌనిక అని, తను ఆటోలలో, బస్సులలో ప్రయాణం చేస్తూ తోటి ప్రయాణీకుల బ్యాగులు కట్ చేసి వాటిలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగతనాలు చేస్తుంటానని చెప్పగా, మహిళా పోలీసు సిబ్బందితో ఆమెను సోదా చేయగా ఆమె వద్ద ఉన్న 5 పేట్ల బంగారు గొలుసు, ఒక నల్ల పూసల దండ,  ఒక నెక్లెస్ ఆమె వద్ద నుండి వశపర్చుకొని, పరిశీలించి, సదరు ఆభరణాలను సాలూరు పట్టణ కేసులో ఈ నెల ఏడున ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి వద్ద నుండి కాజేసిన ఆభరణాలుగా గుర్తించారు.

పట్టుబడిన నిందితురాలు చింతా మౌనిక పై గతంలో విజయనగరం వన్ టౌన్ ,టూటౌన్ పీఎస్ లలో, రామభద్రపురం పోలీసు స్టేషన్లులో కేసులు ఉన్నాయని డిఎస్పీ తెలిపారు. ఇటీవల కాలంలో బ్యాగులలో ఉన్న విలువైన వస్తువలను బ్యాగులు కటింగు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, దీంతో బస్సులలో, ఆటోలలో ప్రయాణించేటప్పుడు విలువైన ఆభరణాలు బ్యాగులలో ఉంచుకోవద్దని, అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ చోరీ కేసును చేధించడంలో కీలక పాత్ర వహించిన విజయనగర సీసీఎస్ సీఐలు ఎస్. కాంతారావు, సి. హెచ్.శ్రీనివాసరావు, సాలూరు సీఐ ఎల్. అప్పలనాయుడు, సాలూరు పట్టణ ఎస్ఐ షేక్ ప్రకృద్దీన్, సీసీఎస్ ఎస్ఐ ఐ. రాజారావు, సీసీఎస్ హెచ్.సి బి. కాశిరాజు, పీసీలు ఎం. బానోజీరావు, బి.శంకరరావులను విజయనగరం జిల్లా ఎస్పీ  దీపిక, నగర డీఎస్పీ పి.అనిల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Satyam NEWS

బిచ్చుంద మండలంలో రంజాన్ కానుకలు పంపిణీ

Satyam NEWS

ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గుండెపోటుతో మృతి

Satyam NEWS

Leave a Comment