30.7 C
Hyderabad
April 29, 2024 06: 58 AM
Slider గుంటూరు

నరసరావుపేట ప్రశాంతతను భగ్నం చేయద్దు లోకేష్

#gopireddysrinivasareddy

రాజకీయ మనుగడ కోసం గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఉన్న ప్రశాంత వాతావరణంలో పాడు చేస్తామని అంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ నరసరావుపేట పర్యటన దేనికోసం ?  రాజకీయ లబ్ది కోసమా? లేక నిజంగానే స్త్రీలపై అంత మమకారమా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో రిషితేశ్వరి, వనజాక్షి, సంధ్య ల ఘటనల్లో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పి నరసరావుపేట లో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

రమ్య విషాదం గుంటూరు లో జరిగిందని, తెలుగుదేశం వారికి అంత బాధ్యత ఉంటే గుంటూరులో ధర్నా చేసుకోవాలని ఆయన అన్నారు. ఆ రోజు శవాన్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేశారని, తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు అతి నీచమైనదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం బాధిత కుటుంబీకులకు ఎక్సగ్రేషియో అందచేసిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ హయం లో ఇలాంటి సంఘటనలు  చాలా జరిగాయని ఆయన తెలిపారు. రిషితేశ్వరి హత్య కేస్ లో ఏ విధమైన న్యాయం అందలేదు.

రిషితేశ్వరి ,సంధ్యారాణి హత్య కేసులో అప్పుడు లోకేష్ ఎందుకు స్పందించలేదు?. ఆనాడు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో డైరీలో క్షుణ్ణంగా కారణాలు రాసింది, ప్రిన్సిపాల్ బాబురావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఏం చేసింది మీ ప్రభుత్వం?. నాడు ఒక్క రూపాయి అయినా ఎక్సగ్రేషియో ఇచ్చారా? అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. వైద్య విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్య కేసులో సైకో ప్రొఫెసర్ పై బహిరంగ ఆరోపణలు వచ్చాయి.ఆ కేసులో మీరు ఏ విదంగా శిక్షించారు.? కేవలం శవ రాజకీయం కోసం అమాయక ప్రజల మానం, మర్యాదలను మంట కలుపుతున్నారు.మీ ప్రభుత్వ హయం లో అరాచక పాలన చేశారు. కనీసం స్త్రీలకు రక్షణ లేకుండా చేసారు అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి అన్నారు.

దేశంలో ఎక్కడా కూడా సంఘటన జరిగిన వెంటనే ఇంత త్వరగా స్పందించిన ప్రభుత్వం లేదు. దిశా చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. దిశ చట్టం పై కేంద్రం తో మేము పోరాటం చేస్తున్నామని, దిశ చట్టం కింద 1500 కేసులు నమోదు చేసామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం మేము ఎదురు చూస్తున్నాం.అంతవరకు దిశా యాప్ మరియు దిశా పోలీస్ స్టేషన్లు ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. అంతే తప్ప మీలా చేతులు ముడుచుకుని కూర్చోలేదు అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి అన్నారు.

Related posts

పట్టపగలే పలమనేరులో ఏనుగుల సంచారం

Satyam NEWS

లాక్ డౌన్ పొడిగింపు వార్తల్లో నిజం లేదు

Satyam NEWS

ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులతో సహా మరో మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment