29.7 C
Hyderabad
May 7, 2024 06: 09 AM
Slider ముఖ్యంశాలు

సమ్మె వీడి, విధుల్లో చేరండి..మంత్రి హరీశ్ రావు

#Minister Harish Rao

వ‌ర్షాలు కురుస్తున్న‌ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది. సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.

దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని మంత్రి హ‌రీశ్ గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయన్నారు.

సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో అడగకుండానే 8,500 రూపాయలకు పెంచారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే 8, 500 నుంచి 9, 500కు పెంచిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు.

Related posts

ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిన గుంటూరు జిల్లా టీడీపీ

Satyam NEWS

నిండు కుండలా మారిన కౌలాస్ నాల ప్రాజెక్ట్

Satyam NEWS

మాతా శిశు సంరక్షణలో  భేష్

Murali Krishna

Leave a Comment