27.7 C
Hyderabad
April 30, 2024 10: 28 AM
Slider ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 31మందికి విముక్తి

#SP Dr. Vineeth

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో మొత్తం 31 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లుగా జిల్లా ఎస్పీ డా.వినీత్ తెలియజేసారు. దేశంలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనలో భాగంగా జనవరి మొదటి తారీఖు నుండి 31వ తేది వరకు జిల్లా పరిధిలో ఆపరేషన్ స్మైల్ 9వ విడత నిర్వహింబడింది.ఇందులో భాగంగా జిల్లా పరిధిలో పోలీసు, ఏహెచ్టియు

యాంటీ హ్యమన్ ట్రాఫికింగ్ యూనిట్), చైల్డ్ లైన్, లేబర్ విభాగాలు సంయుక్తంగా కలిపి 05 బృందాలుగా జిల్లా పరిధిలో వివిధ పరిశ్రమలు,ఇటుక తయారీ పరిశ్రమ,కంకర క్రషర్స్, షాపింగ్ మాల్స్,వ్యాపార సముదాయాలు,హోటళ్ళలో ఆకస్మిక తనీఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనీఖీల్లో 18 సంవత్సరాల లోపు వయసు వున్న మొత్తం 31 మంది బాల

కార్మికులకు పనుల నుండి విముక్తి కలిగించడం జరిగిందని తెలియజేసారు. ఇందులో 22 మంది బాలురు,09మంది బాలికలు వున్నారు. విముక్తి కలిగించిన మొత్తం బాలకార్మికుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 11 మంది కాగా, మిగితా 20 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారులుగా పోలీసులు విచారణలో గుర్తించడం జరిగింది.తనీఖీల్లో గుర్తించబడిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పర్చి చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు

కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.అలాగే చిన్నారులతో పనులు చేయించుకుంటున్న వ్యాపారస్థులపై మొత్తం 17 కేసులను నమోదు చేయడం జరిగిందని.చిన్నారుల బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై వుందని,వారి ప్రాధమిక హక్కులకు భంగం కలిగించవద్దని,18లోపు చిన్నారులతో పనులు చేయించుకోవడం చట్టరీత్యా

నేరమని,ఎవరైనా చిన్నారులతో పనులు చేయించుకుంటున్నట్లుగా సమచారం అందింతే డయల్ 100 గాని, చైల్డ్ లైన్ నంబర్ 1098 నంబర్ సమాచారాన్ని అందించాల్సిందిగా ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు.

Related posts

తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ పదవీ విరమణ

Satyam NEWS

వనపర్తి జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు

Satyam NEWS

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

Satyam NEWS

Leave a Comment