40.2 C
Hyderabad
May 1, 2024 16: 32 PM
Slider నెల్లూరు

లైబ్రరీలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి

#sundaravelli

కాకుటూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో  నేడు  విశ్వవిద్యాలయ గ్రంధాలయ విభాగ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19 నుండి 20 తేది వరకు  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్  (ఐ సి ఎస్ ఎస్ ఆర్) వారి సహకారంతో “డిజిటల్ టెక్నాలజీ ద్వారా అకడమిక్ లైబ్రరీలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చడం” అనే అంశం పై జాతీయ సదస్సు నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ గ్రంధాలయ అధికారిణి  డా వై.సుధారాణి తెలిపారు.

ఈ కార్యక్రమానికి  సంబంధించిన కరపత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ విద్యార్థులకు కమ్యూనికేషన్, డిజిటల్, పరిశోధన నైపుణ్యాలు, మానవ విలువలు, వృత్తిపరమైన నీతి, కాపీరైట్ చట్టం, మేధో సంపత్తి హక్కులు పెంపొందించడానికి దోహద పడతాయని తెలిపారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య విజయ నంద్ కుమార్ బాబు,పి జి సెంటర్ కావలి ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. శ్రీనివాసులు, ఆచార్య సుజా ఎస్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెడ్ హ్యాండెడ్: నలుగురు గుట్కా స్మగ్లర్ల అరెస్ట్

Satyam NEWS

జాతీయ రహదారిపై ప్రమాదంలో మహిళ మృతి

Satyam NEWS

[Free Trial] > Drugs Of Diabetes Mellitus How To Reduce A1C Reduce The Risk Of Diabetes

Bhavani

Leave a Comment