29.7 C
Hyderabad
May 6, 2024 05: 18 AM
Slider ప్రత్యేకం

నరసరావుపేటలో జాతీయ గ్రంధ పాలక దినోత్సవం

#ssncollege

ఆజాదీ కా అమృత మహోత్సవం లో భాగంగా గ్రంథాలయ శాస్త్ర పితామహులు పద్మశ్రీ డా. యస్. ఆర్.రంగనాధన్ జయoతి ని జాతీయ గ్రంధ పాలక దినోత్సవం గా పల్నాడు జిల్లా నరసరావుపేట లో నిర్వహించారు. ఆజాదీ కా అమృత మహోత్సవం 13 వరోజు ఈ కార్యక్రమం స్థానిక ఎస్ ఎన్ కళాశాల లో జరిగింది.

నాటి స్వాతంత్ర్యోద్యమానికి ఊతమిచ్చిన గ్రంథాలయ ఉద్యమం గురించి ఈ సందర్భంగా వక్తలు వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు లైబ్రేరియన్లు, పుస్తక ప్రియులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ శాస్త్ర పితామహులు రంగనాథన్, గ్రంథాలయోద్యమ పితామహులు అయ్యంకి వెంకట రమణయ్య ల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ విశ్రాంత గ్రంధపాలకులు, ప్రముఖ పాత్రికేయులు కెవికె రామారావు ను ఈ సందర్భంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఎస్.ఎస్.ఎన్. కళాశాల లైబ్రేరియన్‌ పి. రామాంజనేయ రెడ్డి తదితర వక్తలు మాట్లాడుతూ అలనాటి స్వాతంత్ర్య ఉద్యమానికి ఎందరో దేశ భక్తులను అందించినది గ్రంథాలయోద్యమమే నని, వారి  త్యాగ -సేవానిరతి ని గుర్తుచేసుకుని, ప్రతి ఒక్కరం గ్రంధాల యోద్యమంలో పాల్గొని, పుస్తక పఠన సంస్కృతిని పెంచాలని పిలుపిచ్చారు.

పలు కళాశాలల గ్రంధపాలకులు గాయత్రి (జె ఎన్ టి. యు) , నాగమణి (ఈశ్వర్ ఇంజనీరింగ్), కె.ప్రసాద్ (కృష్ణవేణి), వావిలాల శాస్త్రి ( ఎస్ ఎస్.ఎన్ ), రాజేశ్వరి ( కోదాటి గ్రంథాలయం), రాజపాలెం గంగాధర్, సాంబశివ రావు, షేక్ భాషా, నారాయణ, రామకృష్ణ , నందిని తదితరులు పాల్గొన్నారు. ఈదర గోపీచంద్ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ గ్రంథాలయ సంఘం లో అందరూ సభ్యులుగా చేరి, ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ డిప్యూటీ మంత్రుల ప్రకటన

Sub Editor

Top Secret: గజ్వేల్ లో పోటీ చేస్తానని ఈటల ఎందుకు అంటున్నారు?

Satyam NEWS

ఎన్టీఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Bhavani

Leave a Comment