33.2 C
Hyderabad
May 12, 2024 12: 53 PM
Slider ఖమ్మం

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్

#ajay

ఈనెల 10వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలిపారు. గత నెల 18న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల వ్యవధిలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను అందజేస్తామని బహిరంగ సభ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్  హామీ ఇచ్చిన విషయం తెలిసింది. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ బాధ్యతలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ అప్పగించగా హరీష్ రావు ఆదేశం మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ పై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే స్థలం గుర్తించడమైందని, ప్రతి జర్నలిస్టు కి 200 గజాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్లకు, టౌన్ రిపోర్టర్లకు, కెమెరామెన్ లకు అందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా అజయ్ కుమార్ తెలిపారు.

ఈ నెల 10న హరీష్ రావుకు అసెంబ్లీలో  వైద్యం బడ్జెట్ పద్దు పై ప్రసంగించే అవకాశం ఉంటే ఆ రోజు ఖమ్మం కు  రానిపక్షంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈనెల 13 గాని లేదా 14 తేదీల్లో గాని కేవలం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం హరీష్ రావు హైదరాబాద్ నుండి ఖమ్మం విచ్చేసి జర్నలిస్టుల పట్టాలు పంపించేసి తిరిగి వెళ్తారని మంత్రి పువ్వాడ గారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన హామీని నెలరోజుల వ్యవధిలో నే  పట్టాల పంపిణీ పూర్తి చేసేందుకు సంసిద్ధులు అయినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి మరియు  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా అజయ్ కుమార్కి జిల్లా కలెక్టర్ గౌతమ్ కి జర్నలిస్ట్ లు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కొత్త సంవత్సరం నుంచి ఏపిలో పాపులర్ బ్రాండ్ మద్యం

Satyam NEWS

హాస్టళ్లు అద్దంలా ఉండాలి:వై ఎస్ జగన్

Satyam NEWS

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Satyam NEWS

Leave a Comment