Slider అనంతపురం

దాబాలు, హోటళ్లలో మద్యం వినియోగంపై పోలీసుల దాడులు

#dabhahotel

అనంతపురం జిల్లాలోని దాబాలు, హోటళ్లలో అక్రమంగా మద్యం వినియోగించకుండా పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ మద్యం నియంత్రణ &  ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దాబాలు, హోటళ్లలో  పోలీసులు తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, దాబాల్లో మద్యం విక్రయించడం, అనుమతించడం మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం. ఈనేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కూడా దాబాల్లో మద్యం వినియోగానికి అనుమతి లేకుండా జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రతీ డాబా, హోటల్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రధానంగా జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న  దాబాలపై దాడులు కొనసాగాయి. జిల్లాలో ఎక్కడైనా కర్నాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలు జరుగుతున్నా దాబాల్లో మద్యం సేవించడానికి అనుమతిస్తున్నా తన ఫోన్ నంబర్ 9440796800 కు సమాచారం తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Related posts

పంచాయితీలో పది లక్షలు కొట్టేసిన కార్యదర్శి

Bhavani

ప్ర‌పంచ హృద‌య దినోత్స‌వం: ఎస్పీ దీపికా జెండా ఊప‌డంతో ప్రారంభ‌మైన ర్యాలీ

Satyam NEWS

రైతుల పాదయాత్ర అనుమతి రద్దుపై విచారణ వాయిదా

Bhavani

Leave a Comment