38.2 C
Hyderabad
April 28, 2024 20: 21 PM
Slider వరంగల్

బీజేపీని గెలిపిస్తే ములుగులో పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం

#amithshah

ములుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ను గెలిపిస్తే పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, బిల్ట్ ను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆదివాసీ, గిరిజనుల అభివద్ధి కోసం కృషిచేస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వారి అభివృద్ధిని పాతాళంలోకి నెట్టివేసిందని, ప్రాజెక్టులు, పథకాల పేరుతో వేలకోట్లు అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర విమర్శలు చేశారు.

ములుగులో జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్ వద్ద ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన  భాజపా పార్టీ అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ఆధ్వర్యంలో సకల జనుల విజయ సంకల్ప సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి లేదన్నారు.

పథకాల పేరుతో వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సీఎం కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగులో మాట్లాడలేనందుకు ములుగు ప్రజలు క్షమించాలన్న అమిత్ షా, వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరుల ఆశీర్వాదాలతో ములుగు గడ్డపై అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ములుగులో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి రూ.900ల కోట్లు మంజూరు చేస్తా భూమి కేటాయించలేని స్థితిలో బీఆర్ఎస్ సర్కారు ఉందని విమర్శించారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే యూనివర్సిటీ పనులు ఆగిపోతాయన్నారు. డాక్టర్ ప్రహ్లాద్ ను గెలిపిస్తే అదనంగా రూ.300ల కోట్లు కేటాయిస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఏర్పడితే గిరిజన, ఆదివాసీ పేద విద్యార్థులకు మేలు జరుగుతుందనే కారణంతోనే అడుగులు పడకుండా చూస్తున్నారన్నారు.

మేడారంకు జాతీయ హోదా కల్పిస్తాం

మేడారం సమ్మక్క, సారలమ్మలకు జాతీయ హోదా కల్పిస్తామని, త్వరలోనే శుభవార్త వింటారని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుచేశామని, గిరిజనుల ద్వారా సేకరిస్తున్న ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి వారి ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేద విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ ట్రైబల్, నాన్ ట్రైబల్స్ మధ్య గొడవలు పెడుతున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఏజెన్సీలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ పట్టాలు ఇస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ గిరిజనుల వ్యతిరేకి..

కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజనుల వ్యతిరేకి అని, అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. కానీ, కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును బలోపేతం చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. ఆదివాసీల యోధుడు బిర్సాముండా ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిందని, వారి అభివ`ద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా గిరిజన ఎంపీలు, మంత్రులు ఉన్నది బీజేపీలోనే అని గుర్తుచేశారు.

దేశ్ కి నేతా మాజీ ప్రధాని ఏబీ వాజ్ పేయీ గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. 2013-14ముందు వరకు ప్రధాని మోదీ పదవి చేపట్టే వరకు కాంగ్రెస్ హయాంలో 24వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తే, మోదీ వచ్చాక రూ.లక్ష కోట్లు చేసి ట్రైబల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7480 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పాటు చేశామని, 50లక్షల మందికి ఇండ్లు ఇచ్చామని, మరుగుదొడ్లు కట్టించామని స్పష్టం చేశారు.

రైతులకు ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా రూ.6000లు అందజేస్తున్నామన్న అమిత్ షా బీజేపీని గెలిపిస్తే రూ.12వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పేపర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఓవైసీ నేతలకు భయపడుతున్నాడని, తాము సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరిపితీరుతామన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందన్నారు.

మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్ల రూపాయలు, ఔటర్ రింగ్ రోడ్డు  మియాపూర్ భూముల వేలంలో వేలకోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరంలోనే కేసీఆర్ ప్రభుత్వం రూ.40వేల కోట్ల అవినీతి చేశారన్నారు. అయోధ్య రామమందిర దర్శనానికి జనవరి 22, 2024న బీజేపీ మీకు ఉచిత దర్శనాన్ని కల్పిస్తుందన్నారు.

ములుగులో పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి

ములుగు జిల్లా మంగపేట మండలంలో ఉన్న బిల్ట్ కర్మాగారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దానిని తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ హోమంత్రి అమిత్ షాను కోరారు. దీనికి స్పందించిన అమిత్ షా తప్పకుండా అభ్యర్థి గెలిస్తే పునరుద్ధరణ చేపట్టి పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్ ప్రహ్లాద్ మాట్లాడుతూ ములుగును అన్నిరంగాల్లో అభి వృ`ద్ధి చేస్తామన్న పాలకులు అథోగతి పాలు చేశారన్నారు.

మా నాన్న మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ చేసిన అభివ`ద్ధి తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ములుగుపై ఎప్పుడూ వివక్ష చూపుతున్నారన్నారు. అందుకు ములుగు జిల్లా ఏర్పాటు 2019, మల్లంపల్లి మండలం ప్రకటన 2023లో చేయడమేనన్నారు. ఆదివాసీ, గిరిజనులు, గిరిజనేతరుల అభివృ ద్ధికి అండగా ఉంటానని, తన చివరి శ్వాస వరకు పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని డాక్టర్ ప్రహ్లాద్ స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు రాబోతోందని, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఒకటవ నంబరులో ఉన్న కమలం పువ్వు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రహ్లాద్ కోరారు.

ఈ సందర్భంగా సుమారు 30వేల మంది సభకు హాజరై సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృ ష్ణవేణి నాయక్, జిల్లా ఇన్చచార్జి వెంకట రమణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి నరోత్తంరెడ్డి, అభ్యర్థి ప్రహ్లాద్ సోదరి పద్మ, నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం, బీజేపీ రాష్ట్ర నాయకులు సూరపనేని వెంకటసురేష్, భూక్య రాజు నాయక్, భూక్య జవహర్ లాల్, వాంకుడోతు స్వరూప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, గాజుల క`ష్ణ, యువమోర్చ అధ్యక్షుడు కొత్త సురేందర్, జిల్లా అధికార ప్రతినిధి డి.వాసుదేవరెడ్డి, మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్, గట్ల శ్రీనివాస్ రెడ్డి, గట్టు మహేందర్, కె.కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంబేద్కర్ ను అవమానిస్తే జూపూడికి పుట్టగతులుండవ్

Satyam NEWS

సూపర్ స్టార్ కృష్ణ ప్రతిరూపాన్ని తయారు చేసిన శిల్పి

Bhavani

కొత్త ఏడాది లో కొత్త జిల్లా ఏర్పాటుకు శ్రీకారం

Satyam NEWS

Leave a Comment