38.2 C
Hyderabad
May 3, 2024 19: 28 PM
Slider కృష్ణ

జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ పాదయాత్రపై తనను కలిసిన నేతలకు లోకేశ్ స్పష్టతనిచ్చారు.

జనవరి 26న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడా విరామం ఉండదని లోకేశ్ చెప్పినట్టు సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ముఖ్యంగా యువతను ఆకట్టుకునే దిశగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటినీ ఈ నెలాఖరు నుంచి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది.

Related posts

బాగ్ అంబర్ పేట డివిజన్ లో ఘనంగా జ్యోతి రావు ఫూలే జయంతి

Satyam NEWS

పోలీసు బాస్ ఆదేశాలతో.. డీఎస్పీ ఆధ్వర్యంలో “స్పందన”…!

Bhavani

మామను చంపిన ఇల్లరికం అల్లుడు

Satyam NEWS

Leave a Comment