29.7 C
Hyderabad
May 1, 2024 09: 50 AM
Slider ఖమ్మం

హామీల అమలులో మోదీ ప్రభుత్వం విఫలం

#aisf

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్న విభజన హామీలు అమలులో మోదీ ప్రభుత్వం విఫలం చెందిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికల రామకృష్ణ విమర్శించారు. ఖమ్మం లోని సీపీఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్ లో సంఘ  జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో రామకృష్ణ మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీపై కేంద్రం నుంచి ఎలాంటి కదలిక లేదు కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా తెలంగాణపై చిన్న చూపు చూడటం ఇందుకు నిదర్శనం అన్నారు. గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పారిశ్రామిక రాయితీలు కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశంలో 157 మెడికల్ కళాశాలలో 16 ఐఐఎం 87 నవోదయ పాఠశాలలు 12 ఐ సి ఆర్ , ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్రానికి ఈ ఒక్క విద్యాసంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు కేటాయించలేదని అయన దుయ్యపట్టారు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేస్థితికి చేరిందని,కోట్లాదిమంది పేద మధ్యతరగతి ప్రజల ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని అయన మండిపడ్డారు.సంస్కరణ ల పేరిట  పరిశ్రమలను దెబ్బతీసి  కార్పొరేట్ శక్తులు అంబానీ, ఆదాని లకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారని అయన పేర్కొన్నారు. విభజన హామీలను నెరవేర్చని మోడీ రాకను అడ్డుకుంటామని అయన తెలిపారు. ఈ సమావేశం లో   జిల్లా సహాయ కార్యదర్శి షేక్ సుభాని ఉపాధ్యక్షులు ధర్మవరపు యువరాజు, సందీప్, సతీష్ నాయకులు గౌతమ్, వెంకటేష్, రాము నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా మాజీ భారత ప్రధాని పి.వి.నర్సింహారావు జయంతి

Bhavani

ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్ లో ఉద్యోగావకాశాలు

Satyam NEWS

[Free|Sample] Advice On How Can Control And Treat Type 2 Diabetes Type Ii Diabetes Drugs Jardiance Diabetes Drugs

Bhavani

Leave a Comment