గుంటూరు జిల్లా జైలులో ఉన్న అమరావతి రైతులను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గుంటూరు హై వే దిగ్బంధం కేసులో పలువురు రైతులను అరెస్టు చేసి జిల్లా జైలులో ఉంచారు.
వారందరిని నేడు లోకేష్ పరామర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. అవసరమైనంత మేరకు వారికి న్యాయ సహాయం అందే విధంగా కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ వెంట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ జయదేవ్ పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.