ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ కోర్టు వద్ద బాంబు పేలుడు కలకలం రేపింది.కోర్టు హాల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాంబు లు అమర్చినట్లు తెలుస్తుండగా ఎవరిని టార్గెట్ చేస్తూ బాంబు లు తెచ్చారో తెలియాల్సి ఉంది. రాష్ట్ర విధానసభకు కేవలం కిలో మీటర్ దూరంలోనే ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు లాయర్లు గాయపడినట్టుగా తెలుస్తోంది.
దీంతో కోర్టు పరిసరాల్లో ఆందోళకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే ఘటన స్థలంలో మరో మూడు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కాగా కోర్ట్ హాల్ బాంబ్ పేలుళ్లపై పోలీస్ లు అప్రమత్తమయ్యారు.