గన్నవరం విమానాశ్రయంలో 20కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి బిల్లులు లేకుండానే కార్గో కొరియర్ ద్వారా బంగారు, వెండి ఆభరణాలను విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పన్నులు ఎగ్గొట్టి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, నగరంలోని పలు బంగారు దుకాణాల్లో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.17 కోట్లుగా ఉంటుందని, అలాగే వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.