26.2 C
Hyderabad
February 13, 2025 21: 49 PM
Slider ఆధ్యాత్మికం

అరసవెల్లిలో వైభవంగా ఉత్తరద్వార దర్శనం

Asasavalli-Srikakulam-Suryanarayana-Swamy-Temple-5

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్తరద్వార దర్శనం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు. సోమవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అనంతరం గరుడ వాహనంపై స్వామి వారిని నాలుగు మాడ వీధులు ఘనంగా తిరువీధి నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఇప్పిలి రాజేశ్వర కాశ్యప (నగేష్ శర్మ), రంజిత్ శర్మ, సందీప్ శర్మ, ఫనీంద్ర శర్మ తదితరుల అర్చక బృందం స్వామివారికి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనివెట్టి మండపం లో వైకుంఠ ఏకాదశి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

సింహా వాహనం పై దర్శన మిచ్చిన కోదండ రాముడు

Satyam NEWS

సంపదను సృష్టిద్దాం.. ప్రజలకు పంచుదాం

mamatha

అంధకారం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు

Satyam NEWS

Leave a Comment