28.7 C
Hyderabad
May 6, 2024 02: 07 AM
Slider గుంటూరు

ఘనంగా మహంకాళీ అమ్మవారి ఆలయ కల్యాణ మండప ప్రారంభోత్సవం

#mahakali

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కల్యాణ మండపాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ నరసరావుపేట పరిధిలోని అన్ని అలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హయం లో నరసరావుపేట జిల్లా కేంద్రం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇస్సాపాలెం ఉన్న ఆలయానికి అన్ని విధాల సహకారం అందిస్తామని మాట ఇచ్చారు. రానున్న కోటప్పకొండ తిరుణాళ్లకు కూడా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలపారు.

శాసన సభ్యులు గోపిరెడ్డి మాట్లాడుతూ  దేవాదాయశాఖ మంత్రి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి చేతుల మీదుగా అమ్మవారి ఆలయం అభివృద్ధి చేయటం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆలయంలో అన్ని విధాలా భక్తులకు అవసరం అయిన సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ ఆలయానికి  ప్రతి రోజు 7000 మంది భక్తులు సందర్శించడం జరుగుతుందని తెలిపారు. భక్తుల మనోభావాలు అనుకూలంగా  అమ్మవారి ఆలయం అభివృది చేస్తామని హామీ ఇచ్చారు. సీజీఎఫ్ ద్వారా నిధులు విడుదల చేసి ఆలయాల అభివృద్ధికి తోడ్పాటును అందిచాలని కోరారు. అనంతరం ఇస్సాపాలెం గ్రామంలో వైఎస్ఆర్ గారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు, ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, రొంపిచర్ల జెడ్పీటీసీ ఓబుల్ రెడ్డి,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, శారదాంబ జ్యువెలర్స్ పార్ట్నర్ నాగసరపు రాందేవ్ గుప్త, దేవస్థానం పాలకమండలి చైర్మన్ జల్లి శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి టి. సుధాకర్ రెడ్డి అర్చక స్వాములు కొత్తలంక సుధాకర్ శర్మ, కార్తీక్, నండూరి కాళీ కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తిరుపతి రెడ్డి ఆర్.ఎం.పి శ్రీనివాసరావు అశోక్ కుమార్ మునగ శ్రీనివాస రావు ఆలయ సిబ్బంది శ్రీనివాస్ గుప్తా, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సేవ్ గరల్ ఛైల్డ్: రేపు బాలికా దినోత్సవం

Satyam NEWS

జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

Sub Editor

Leave a Comment