Slider ప్రత్యేకం

సమ్మె విరమణ: భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు

#jagan

ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు చేసుకున్న ఒప్పందం తమకు అంగీకారం కాదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

ఉద్యోగ సంఘాల నాయకుల దిష్టి బొమ్మలు తగులబెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. పీఆర్సీ సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఆరో తేదీ అర్ధ రాత్రి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు వెళ్లాల్సి ఉంది. అయితే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. తమ డిమాండ్లపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్ శర్మతో చర్చించామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తాము పెట్టిన 71 డిమాండ్లపై చర్చించామన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

పెండింగ్‌లో వున్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించామని మంత్రి తెలిపారు. ఉద్యోగ సమస్యలపై సమావేశాలు పెట్టి పరిష్కరిస్తామని బుగ్గన హామీ ఇచ్చారు. ఆందోళన విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరామని మంత్రి తెలిపారు. కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి బుగ్గన వెల్లడించారు.

తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఫ్యామ్లీ మెంబరుగా భావిస్తోందని.. టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని.. ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారని బుగ్గన తెలిపారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కంటిన్యూగా టచ్లో ఉంటామని.. ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరామని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దురుద్దేశ్యంతో ఉద్యమానికి వెళ్లలేదని, సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమించామని తెలిపారు.

ఆర్ధికేతర సమస్యలు కూడా చాలా కాలం పెండింగులో ఉన్నాయని.. తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని బొప్పరాజు వెల్లడించారు. బుధవారం స్వయంగా సీఎస్ సమీర్ శర్మ సమీక్షించనున్నారని.. ప్రభుత్వ సానుకూల స్పందనతో తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Related posts

కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు

Bhavani

పేదల్ని చంపుతున్న ఆకలి బాధలు తెలియని ఎమ్మెల్యేలు

Satyam NEWS

పోలింగ్ ముగిసింది… కొత్త ఆట మొదలు కాబోతున్నది…

Satyam NEWS

Leave a Comment