31.7 C
Hyderabad
May 2, 2024 10: 34 AM
Slider గుంటూరు

శివోహం: కోటప్ప కొండకు తరలి వస్తున్న భక్తకోటి

kona raghupathi

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలతో అభిషేకం చేసి అర్ధరాత్రి తొలి పూజ చేశారు. తెల్లవారుజామున భక్తులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వారి కి ఎండ తగలకుండా ఉండటానికి ఆలయ అధికారులు చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేసారు. అలాగే స్వామి వారి దర్శనం కోసం వి.ఐ. పి లు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొద్దీ సేపు వి.ఐ. పి ల తాకిడి కి గురి ఆయన సామాన్య భక్తులు ప్రభుత్వానికి, ఆలయ అధికారులకు, పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు కలగచేసుకొని  వి.ఐ. పి ల తాకిడిని తగించటం తో భక్తులు శాంతించారు.

అలాగే స్వామి వారి ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సందర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి కి అన్ని ఏర్పాట్లు బాగా చేసారని ప్రతి ఒక్కరు స్వామి వారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు తీసుకోవాలని అన్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అని అన్నారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ప్రతీ ఒక్కరు సుఖ సంతోషాలు తో  ఉండేవిధంగా చూడాలని అ త్రికోటేశ్వర స్వామి వారిని ప్రార్ధించాను అని అన్నారు. అలాగే స్వామి  వారిని ఎం.పి లావు శ్రీకృష్ణ దేవరాయలు, లేళ్ల అప్పిరెడ్డి, పలువురు న్యాయ మూర్తులు దర్శించుకున్నారు.

Related posts

సిఎం జగన్ కు విశ్వహిందూ పరిషత్ అల్టిమేటమ్

Satyam NEWS

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

రిక్వెస్టు: పొగాకు రైతులను తక్షణమే ఆదుకోండి

Satyam NEWS

Leave a Comment