29.7 C
Hyderabad
May 2, 2024 06: 11 AM
Slider ముఖ్యంశాలు

సిఎం జగన్ కు విశ్వహిందూ పరిషత్ అల్టిమేటమ్

#TTD

కలియుగ దైవం, ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దేవుడు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు, అపవిత్రం చేసేందుకు ఆస్తులను కొల్లగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను సాగనివ్వమని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ ఆస్తులను అమ్మేందుకు ఎవరికి అధికారం లేదని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. దేవుడి పేరుమీద ఉన్న భూములలో అంగుళం భూమి కానీ, గుండు సూదికానీ అమ్మే అధికారం ట్రస్టీలకు లేదని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది.

భక్తులు భగవంతుడికి విరాళంగా ఇచ్చిన భూములను అమ్మడం వారి మనోభావాలను దెబ్బతీయడమేనని దాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో సహించమని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ట్రస్టు బోర్డుతో తీర్మానం చేయించి భగవంతుడి ఆస్తులు కొల్లగొట్టాలని చూడటం క్షమించరాని నేరమని దీన్ని నిలుపుదల చేసేందుకు మరో కరసేవ చేయడానికి కూడా తాము వెనుకాడమని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.

హిందూ మత వ్యతిరేక పాలనకు తెరతీశారు

హిందూ మత వ్యతిరేక పాలనకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరతీశారని, ఏపి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి పాస్టర్లకు ప్రాధాన్యతనిస్తున్నారని విహెచ్ పి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా మతమార్పిడులు జరుగుతున్నాయని విహెచ్ పి తెలిపింది.

పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు టీటీడీని కాపాడుకోవాలని, వెంకన్న స్వామి భక్తులు ఉద్యమించి స్వామి వారిపై చూపుతున్న చులకన భావాన్ని ఎత్తి చూపాలని విశ్వహిందూపరిషత్ పిలుపునిచ్చింది. క్రిస్టియన్ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, విహెచ్ పి రాష్ట్ర కార్యదర్శి బండారి రమేశ్ పిలుపునిచ్చారు. లేకపోతే ఏడు కొండలను మూడు కొండలు చేసే కుట్రను మళ్లీ తెరమీదకు తెచ్చే ప్రమాదం లేకపోలేదని విహెచ్ పి ఆందోళన వ్యక్తం చేసింది.

Related posts

మారుతున్న లెక్కలు: సీఎం జగన్ ప్లాన్ ‘బి’

Satyam NEWS

ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి

Satyam NEWS

జేపీఎస్ లకు వైఎస్ఆర్టిపి మద్దతు

Satyam NEWS

Leave a Comment