37.2 C
Hyderabad
May 2, 2024 14: 12 PM
Slider ఆధ్యాత్మికం

రుద్రాయనమహ: కాళరాత్రి పూజ పరమార్థం ఏమిటి?

maha siva 2

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

త్రిమూర్తులలో మూడవ వాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఓసారి ప్రళయం వచ్చింది. అప్పుడు ప్రపంచమంతా చీకటి కోణమైపోయింది. జీవులు అణురూపంలో మైనం ముద్దమీద బంగారు రేణువులలా అంతరాళంలో ఉండిపోయారు.

అప్పుడు పార్వతీదేవి లోకహితాన్ని కాంక్షించి శివుని గురించి తపస్సు చేసింది. అప్పటి దీర్ఘకాళరాత్రిని తప్పించి మామూలు రాత్రింబవళ్ళు కల్పన చేసి జీవులను ఉద్ధరించవలసందిగా పార్వతీ  శివుణ్ణి కోరింది. శివుడు తథాస్తు అన్నాడు. తాను చేసినట్లే రాత్రి పూట శివపూజ చేసే వారికి సమస్త సౌఖ్యాలు చేకూరే విధంగా కూడా పార్వతీ దేవి శివుడి వల్ల వరం పొందింది.

ప్రళయ కాలంనాటి దీర్ఘ కాలం రాత్రి సమయంలో పార్వతి చేసిన శివపూజ ప్రళయానంతరం శివరాత్రి నాటి శివపూజగా పరిణామం చెందింది. నాలుగు జాముల్లో నాలుగు రకాలుగా శివపూజ సాగాలంటున్నాయి శాస్త్రాలు. తొలిజాములో శివుని పాలతో అభిషేకించాలి. పద్మాలతో పూజించాలి. పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెట్టాలి. రెండో జాములో పెరుగుతో అభిసేకం చేయాలి. తులసిదళాలతో అర్చించాలి.

పాయలం సైనేద్యం పెట్టాలి. మూడో జాములో నేతితో అభిషేకించాలి. మారేడు దళాలతో పూజించాలి. నువ్వుల పొడి కలిసిన తినుబండారం నివేదించాలి. నాలుగో జానులో తేనెతో అభిషేకం చేయాలి. నీలోత్పలాలతో పూజించాలి. కేవలం అన్నం నైవేద్యం పెట్టాలి. శివభక్తులు శివరాత్రి పుణ్యదినాన్ని పురస్కరించుకుని శివక్షేత్రాలను దర్శిస్తారు. 

భారత దేశమంతటా విస్తరించియున్న జ్యోతిర్లింగాలు, పంచ భూత క్షేత్రాలు ముఖ్యమైనవి. భారతదేశంలో జ్యోతిర్లింగ రూపాలలోనే కాక, శివుడు పంచభూతలింగ స్వరూపాలుగా కూడా వెలిశాడు.

భక్తులు ఆకాశలింగాన్ని చిదంబరంలోను, వాయులింగాన్ని శ్రీకాళహస్తిలోను, అగ్నిలింగదర్శనం అరుణాచలేశ్వరంలోను, జల లింగాన్ని జంబుకేశ్వరంలోను, పృధ్వీలింగాన్ని కంచిలోను దర్శించవచ్చు. ఇవికాకుండా  సూర్యలింగం కోణార్క్ లోను, చంద్రనాథలింగం సీతాకుంజ్‌ కొండ (చిట్టగాంగ్‌)లోను ఉన్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని త్రిలింగదేశంగా పేర్కొనేవారు. కారణం ముఖ్యమైనవి మూడు శివలింగాలే.

మొదటిది శ్రీశైలమల్లికార్జున మహాలింగం. రెండవది  దాక్షారామంలోని భీమేశ్వరలింగం, మూడవది కాళేశ్వరంలోని మహాకాళేశ్వరం. ఈ మూడు ప్రసిద్ధ క్షేత్రాలు రాయలసీమ, తీరప్రాంతం, తెంగాణప్రాంతాలలో ఉన్నాయి. అందుకే ఆంధ్ర దేశాన్ని త్రిలింగ దేశం అనేవారు.

శివరాత్రి పర్వదినంనాడు యావత్ భారతంలో ఉన్న శివక్షేత్రాలన్నీ ‘హరహర మహాదేవ, శంభోశంకర, ఓం నమశ్శివాయ’ అని భక్తి పారవశ్యంతో భక్తులు చేసే నినాదాలతో మారుమోగుతూ ఉంటాయి.

యామిజాల జగదీశ్

Related posts

జర్నలిస్టుల మహాసభను  జయప్రదం చేయండి

Satyam NEWS

ఆంధ్రా బిజెపి వర్సెస్ తెలంగాణ బిజెపి

Sub Editor

వర్షం నీరు నిల్వకుండా పటిష్టమైన చర్యలు

Satyam NEWS

Leave a Comment