29.7 C
Hyderabad
May 1, 2024 05: 53 AM
Slider

దిగ్విజయంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం”

srikakulam meeting

శ్రీ‌కాకుళంలోని పాత్రునివలస గ్రామంలో స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు రానున్న సంవత్సరములో “మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం” ద్వారా గ్రామంలో చేపట్టవలసిన ముఖ్యమైనటువంటి పనులను గుర్తింపు కొరకు గ్రామ ప్రజలు అందరితో గ్రామ సచివాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేసి పనులు గుర్తించారు.

ఈ పనులను మంజూరు చేసి చేపట్టినట్లు అయితే గ్రామంలో గల రైతులకు పండ్ల తోటల పెంపకం, “జలకళ “పథకంలో బోర్లు వేయటం, రోడ్ల నిర్మాణము, మరుగుదొడ్ల నిర్మాణం, మొదలైన అనేక కార్యక్రమాలు గ్రామములో పూర్తి స్థాయిలో జరుగుతాయి.

ఈ కార్యక్రమాల ద్వారా గ్రామ అభివృద్ధి తో పాటు రైతులు, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రతినిధి గంగు వెంకటరమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏ పి ఓ సీతారాం, గ్రామ కార్యదర్శి తిరుమల దేవి, వీఆర్ఓ రాము, గ్రామ పెద్దలు బాణాల గాంధీ, పల్లి వైకుంఠం, అప్పారావు వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఆదినారాయణ పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలు రైతులు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

గరళ కంఠాయనమహ: ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలి?

Satyam NEWS

స్కూలుకు పంపిన కోడిగుడ్లలో పురుగులు

Satyam NEWS

కేసీఆర్ ముఖ్యమంత్రా? లేక కాంట్రాక్టర్ల బ్రోకరా?

Satyam NEWS

Leave a Comment