42.2 C
Hyderabad
May 3, 2024 15: 46 PM
Slider వరంగల్

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఎన్నిక

#MahatmaJyothibapoole

మహాత్మ జ్యోతిరావు  బాపులే విగ్రహ ప్రతిష్టాపన  కమిటీ సమావేశం శుక్రవారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని SC కాంప్లెక్స్  లో జరిగింది.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే కుల వ్యవస్థ నిర్మూలన తో పాటు సమాజంలో మహిళలకు విద్య అభివృద్ధికి తోడ్పాటు అందించారు.

స్త్రీలు  విద్యావంతులు భావించి దేశంలో తొలి బాలికల పాఠశాల ప్రారంభించారు. సత్యశోధక ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక అయ్యాడు. 

అందుకే ములుగు జిల్లా కేంద్రంలో మహాత్ముని విగ్రహం ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలు ప్రజలకు విద్యా వ్యవస్థ ఈరోజు అందుతుంది అంటే దానికి కారణం ఆ మహాత్ముడే.

మహిళలకు మొదటిసారిగా విద్య అందించడం కోసం విశేషంగా కృషి చేసిన జ్యోతి రావు పూలే విగ్రహం ములుగు జిల్లా కేంద్రంలో అందరి సహకారంతో ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశారు.

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ గా ములుగు మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అన్న తిరుపతి, కో కన్వీనర్ గా వెంకటాపురం మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన మై సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అదేవిధంగా సభ్యులుగా గుండాల రఘు, తుల విజయ్, మరి మధు, నక్కరాజు, కొండమల్లె శ్రవణ్, పెండాల సుందర్, కాడ పా క రాజశేఖర్, కోట్టపాక శ్రీనివాస్, రెడ్డి రఘు, కుమ్మరి సాగర్, జన్ను భరత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related posts

ఆడపిల్లలకు అప్స ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ

Satyam NEWS

ప్రతి ఒక్కరు మెచ్చే “ఇద్దరు”: సోని చరిష్టా

Satyam NEWS

ప్రొఫెసర్ నాగేశ్వర్, బీజేపీ రాంచందర్ రావు పట్టభద్రులను పట్టించుకోలేదు

Satyam NEWS

Leave a Comment