37.2 C
Hyderabad
May 6, 2024 20: 55 PM
Slider మహబూబ్ నగర్

మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పాశం

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పాశం రాకేష్ ను నియమించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో తెలంగాణ మాలమహానాడు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామానా తెలంగాణ మాలమహానాడు ను విస్తరించాలని కోరారు. గ్రామ కమిటీలను, మండల కమిటీలను,  నియోజకవర్గం కమిటీలను వేసి సంఘం  బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలందరూ సంఘటితం చేసి ఉద్యమించాలన్నారు. దళితుల ఐక్యత కోసం స్వర్గీయ పివి రావు ఆలోచనా విధానంతో, డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలతో  పోరాటం చేయాలని అన్నారు. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగిన వారికి అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క దళిత బిడ్డ కు చేరే విధంగా కృషి చేయాలన్నారు. నూతనంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పాశం రాజేష్ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్యకు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు కు, జిల్లా యువత అధ్యక్షులు ఏనుపోతుల కర్ణ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా యువత అధ్యక్షులు ఎనుపోతుల కర్ణ,  జిల్లా యువత ప్రధాన కార్యదర్శి జీడి శశిధర్, యువత జిల్లా కార్యదర్శి హకీంపేట వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి శివకుమార్, హన్వాడ మండల అధ్యక్ష కార్యదర్శులు గుంత లక్ష్మయ్య, ధర్పల్లి బాలకిష్టయ్య, గండీడ్ మండల అధ్యక్షులు బక్తుల వెంకటయ్య,  కావలి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

కొనసాగుతున్న యాదాద్రి ముఖ్య అర్చకుడి అన్నవితరణ

Satyam NEWS

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు కోవిడ్ బ్రేక్

Satyam NEWS

Gujarat Election: తాడో పేడో తేల్చేది గిరిజన ఓటర్లే

Satyam NEWS

Leave a Comment