31.7 C
Hyderabad
May 2, 2024 09: 47 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ మాల మహానాడు బలోపేతానికి చర్యలు

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులుగా సాతర్ల శివకుమార్ ను, పట్టణ ప్రధాన కార్యదర్శిగా మంత్రి నవీన్ కుమార్ ను నియమించి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మాలలను అంతా ఏకం చేసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగస్వాములను చేసి ఉద్యమించాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, స్వర్గీయ పివి రావు ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా  పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, జిల్లా కార్యదర్శి కాడం రాఘవేందర్, జిల్లా సహాయ కార్యదర్శి బ్యాగరి వెంకటేష్, మహబూబ్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు తోళ్ళ  మాసయ్య, జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు రాగుల రాజు, హన్వాడ మండలం ఉపాధ్యక్షులు పత్తి మునయ్య, బాలనగర్ మండల కార్యదర్శి రాజేందర్, విద్యార్థుల మండల కార్యదర్శి ఆచర్ల మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమ్మా….నిన్ను కష్టపెట్టిన ఈ ‘బంగారు తెలంగాణ’ను క్షమించు తల్లీ….

Satyam NEWS

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన భారత్ ముక్తిమోర్చా

Satyam NEWS

వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లనివ్వాలి

Satyam NEWS

Leave a Comment