35.2 C
Hyderabad
April 27, 2024 14: 48 PM
Slider ప్రత్యేకం

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన భారత్ ముక్తిమోర్చా

#bharatmuktimorcha

ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవడం లేదని ఆరోపిస్తూ భారత్ ముక్తి మోర్చా నాయకులు నేడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈరోజు ర్యాలీ లేదా మార్చ్ నిర్వహించేందుకు మోర్చా అనుమతి కోరిందని, అయితే శాంతిభద్రతల పరిస్థితి కారణంగా అనుమతి ఇవ్వలేదని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. కార్యకర్తలు సహకరించకపోవడంతో జరీపట్క, పంచపావోలీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు ఆయన తెలిపారు. కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన ‘ఉప్పెన‌లోని జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు’

Satyam NEWS

మిడతల దండు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు

Satyam NEWS

తెలంగాణ లో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు

Satyam NEWS

Leave a Comment