37.2 C
Hyderabad
May 2, 2024 11: 20 AM
Slider రంగారెడ్డి

కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకం

#bandari

కాలనీలు అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి సంక్షేమ సంఘాల పాత్ర కీలకమని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగరెడ్డి ధన్పాల్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ మారుతి కాలనీలో బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాలముగ్గుల పోటీలలో ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డిలు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగవల్లులను తలపించేలా ముగ్గులు వేయడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పెద్దా అని తేడా లేకుండా ముగ్గుల పోటీలలో పాల్గొని మంచి ఆలోచనలతో ఒకరిని మించి మరొకరు ఆరోగ్యకరమైన పోటీపడుతూ ముగ్గులు వేయడం స్వాగతించదగ్గ పరిణామన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు డప్పు గిరిబాబు,బి ఎల్ ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు వేమూరి మహేష్ గౌడ్, రంజిత్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు చక్రిపురం, వాసవి శివ నగర్, వైష్ణవి ఎంక్లేవ్, మారుతి కాలనీ, సాయి నగర్, శివ సాయి నగర్ తదితర కాలనీల అధ్యక్ష కార్యదర్శి వర్గం సభ్యులు ఎంపల్లి పద్మా రెడ్డి, మొగిలి రాఘవరెడ్డి, పంజాల శ్రీనివాస్ గౌడ్, గంప కృష్ణ, పలుగుల మహేందర్, సారా వినోద్ ముదిరాజ్, కట్కూరి బుచ్చిరెడ్డి, కట్కూరి విజయ్ కుమార్ రెడ్డి, యాదిరెడ్డి, లంక దాసరి సుధాకర్, కొండారెడ్డి, సోలిపురం శంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమణ, రెడ్డి నాయక్, హనుమంతు నాయక్, నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

పోడు హక్కు కోసం గ్రామసభలు

Murali Krishna

క‌లెక్ట‌ర్ కు రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల సంఘం అవార్డు

Sub Editor

A Question: ఇవన్నీ కాస్ట్లీ కరోనా కేసులు గురూ

Satyam NEWS

Leave a Comment