20.7 C
Hyderabad
December 10, 2024 02: 14 AM
Slider ప్రత్యేకం

హలో బ్రదర్: బెత్తం దెబ్బలు వర్సెస్ మరణ శిక్ష

helo brother

రేప్ చేసిన వారిని నాలుగు బెత్తం దెబ్బలతో శిక్షించాలని తమ్ముడు చెబితే అన్న మాత్రం మరణ శిక్ష విధించే చట్టాన్ని సమర్థిస్తున్నారు. దిశ సంఘటన జరిగిన కొత్తలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలాంటి వారికి బెత్తం దెబ్బలు సరిపోతాయని బెత్తం దెబ్బలతో ఛమడాలు వలిచేయాలని చెప్పారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. రేప్ చేసిన వారికి 21 రోజుల్లో మరణశిక్ష వేయాలనేది ఆ చట్టం సారాంశం. దీన్ని అన్న చిరంజీవి సమర్థిస్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే: ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.

ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసింది. ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉంది.

అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయం. సీఆర్పీసీ(CRPC) ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ(IPC) ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు  ఉంది. -చిరంజీవి

Related posts

ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్‌ అథారిటీ ఏర్పాటు

Bhavani

CMRF చెక్కులను అందజేసిన ప్రజా ప్రతినిధులు

Satyam NEWS

15 వేల ఐటీ ఉద్యోగాలు…ఐటీ మంత్రిగా లోకేష్‌ విజయం

Satyam NEWS

Leave a Comment