28.7 C
Hyderabad
May 5, 2024 23: 28 PM
Slider తూర్పుగోదావరి

మానవత్వాన్ని చాటిన మండపేట పోలీసులు

#mandapetapolice

రక్తస్రావంతో కన్నీటి పర్యంతమై పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళకు సపర్యలు చేసి ప్రధమ చికిత్స అందించి పోలీసులు మానవత్వం ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా  మండపేట లో ఈ సంఘటన జరిగింది. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ స్కూల్ 7th వార్డ్ కు చెందిన కొడమంచిలి రత్నకుమారి పై ఆమె భర్త కొడమంచిలి సుబ్బారావు దాడి చేశాడు. అతను తరచూ మద్యం సేవించి ఇంటి వద్ద గొడవ చేస్తుండేవాడు. రత్నకుమారి భర్త ను పలుమార్లు వారించినా అతను వినలేదు. మద్యం సేవించ వద్దని మందలించిన సుబ్బారావు ఆగ్రహానికి గురై ఇంటి లోఉన్న కత్తిపీట చెక్కతో ఆమెపై తలపై దాడి చేశాడు. తలకు తీవ్రమైన గాయమై రక్తస్రావంతో మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి ఆమె వెళ్లింది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ G.చిన్నారావు, మహిళా కానిస్టేబుల్ మంగాదేవి తక్షణమే స్పందించి రత్నకుమారి తలకు కట్టు కట్టి స్థానికంగా ఉన్న యువత సహాయంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యం అందించారు. అంకిత భావంతో విధి నిర్వహణ చేసిన చిన్నారావు, మంగాదేవి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ వేతన ఒప్పంద చర్చలు సఫలం

Satyam NEWS

`ఓదెల రైల్వేస్టేషన్`లో `స్పూర్తి`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

ఆదివాసీల హక్కుల కోసం… ఒక చైర్మన్ గా పోరాడుతా…!

Bhavani

Leave a Comment