30.7 C
Hyderabad
May 5, 2024 03: 44 AM
Slider నల్గొండ

ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ వేతన ఒప్పంద చర్చలు సఫలం

#RiceMills

గత కొన్ని నెలలుగా వేతన చర్చలలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగిస్తూ రైస్ మిల్లు కార్మికులకు,యజమానులకు ఒప్పందం కుదిరింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకు రైస్ మిల్లు యజమానులు,యూనియన్ నాయకులు చర్చలు జరిపారు. చివరకు కార్మికులకు రూ.2200 పెంచుతూ ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ నేటి ధరలు, పరిస్థితులకు అనుగుణంగా కార్మికులకు మెరుగైన ఒప్పందం చేయటం హర్షణీయమని అన్నారు. ఈ వేతన ఒప్పందం రెండు సంవత్సరాలు కాల పరిమితితో ఉంటుందని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వటానికి యాజమాన్యాలు ముందుకు రావాలని కోరారు. ఈ ఎస్ ఐ కార్డులు వెంటనే త్వరితగతిన మంజూరు చేయాలని, డిస్పెన్సరీని, పూర్తిస్థాయి మెడికల్ సదుపాయాలతో ఏర్పాటు చేయాలని, దానికి అనుగుణంగా యాజమాన్యాలు ఈ ఎస్ ఐ బోర్డు అధికారులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు యాజమాన్యం,CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోశపతి, టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షుల పచ్చిపాల ఉపేందర్, ఐఎన్టియుసి యూనియన్ అధ్యక్షు సలిగంటి జానయ్య, బెల్లంకొండ గురవయ్య, పోతన బోయిన రామ్మూర్తి , మేకపోతుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు 48 గంటలు బంద్

Satyam NEWS

డిపిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్.పురుషోత్తం

Satyam NEWS

Leave a Comment