27.7 C
Hyderabad
April 30, 2024 08: 49 AM
Slider సినిమా

అమీర్ పేట్ లో మాంగళ్య మాల్ 6వ షోరూం ప్రారంభం

#KalvakuntlaKavitha

అమీర్ పేట్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 6వ షాపింగ్ మాల్ ను మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేడు ప్రారంభించారు.

అమీర్ పేట్ గోల్డ్ స్పాట్ సమీపంలో ఏర్పాటైన ఈ అతి పెద్ద మాంగళ్య షాపింగ్ మాల్ మన్నికైన దుస్తులనకు నిలయంగా చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్నదని కవిత అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ ఫౌండర్ పి ఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్ కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ లను కవిత అభినందించారు.

మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థ మరింత పురోభివృద్ధి సాధించాలని కవిత కోరారు. హైదరాబాద్ లోని మదీనాకూడా, బోడుప్పల్, వనస్థలిపురం, కూకట్ పల్లి, చింతల్ లో ఇప్పటికే మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటు కాగా అమీర్ పేట్ లో 6వ స్టోర్ అని నిర్వాహకులు తెలిపారు.

కరీంనగర్, సిద్దిపేట్, హన్మకొండ షోరూమ్ లతో కలిపితే తెలంగాణలో ఇది 9వ షాపింగ్ మాల్ అని వారు వివరించారు. అన్ని వయసులకు చెందిన కొనుగోలుదారులు తమకు కావాలసిన అన్ని రకాల తాజా ఫ్యాషన్, స్టయిల్స్ కోసం అమీర్ పేట్ లోని ఈ షోరూం ను తప్పకుండా సందర్శించాలని వారు కోరారు.

విస్తృత శ్రేణి చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రస్ మెటీరియల్స్ తమ వద్ద ఉన్నాయని పి ఎన్ మూర్తి అన్నారు. కాంచీపురం పట్టు చీరలు, ఉప్పాడ చీరలు హై ఫ్యాన్సీ చీరలు నుంచి మగవారి కోసం ధోతీలు, కుర్తీలు, షర్టులు, టీషర్టులు, ట్రౌజర్స్, జీన్సు వెడ్డింగ్ వేర్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

Related posts

సింగపూర్‌ ప్రయాణికులకు ఇండియా ఊరట

Sub Editor

రోడ్డుకు రంధ్రం వాహనాల రాకపోకల బంద్

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: హైదరాబాద్ లో 23 మంది జర్నలిస్టులకు పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment