40.2 C
Hyderabad
May 6, 2024 17: 08 PM
Slider ప్రత్యేకం

సుస్థిర అభివృద్ధి సాధనకు మనసు పెట్టి పని చేయాలి…!

#suryakumariias

మానవ అభివృద్ధికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి సూచీల సాధన కోసం ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పని చేయాలని ఏపీ రాష్ట్ర ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు.  ఏ పని ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం  అని ఆత్మావలోకనం చేసుకోవాలని,  నిజమైన అభివృద్ధికోసం పని చేస్తున్న అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావించి ఇష్టం తో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ముందుగా ఎస్.డి.జి లక్ష్యాలను ఎందుకు పెట్టవలసి వచ్చింది, వాటి ఉద్దేశ్యాలను పూర్తిగా అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు  సుస్థిర అభివృద్ధి, స్పందన  కార్యక్రమాల పై అవగాహనా సదస్సు నిర్వహించారు. 

ఈ కార్యక్రమం లో సెక్రటరీ విజయకుమార్ మాట్లాడుతూ  రాష్ట్రం లో 17 సుస్థిర అభివృద్ధి సూచీలను ప్రధాన్యతలుగా తీసుకొని 2030 నాటికి  శత శాతం సాధించే  దిశగా లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరిగిందని అన్నారు. ఇందులో ప్రధానంగా సామజిక, ఆర్ధిక, పర్యావరణ, పీస్ అండ్ పార్టనర్షిప్  అంశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం లో ఈ  సూచీలను సాధించడానికి   ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను  వీటికి మాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు.  నీతి  అయోగ్  అమలు చేస్తున్న 115 ఎస్.డి.జి సూచీలలో జిల్లా స్థాయి లో 61 , గ్రామ, వార్డ్ స్థాయి లో 47 ప్రభుత్వ పధకాలను మాపింగ్ చేయడం జరిగిందన్నారు.   

రాష్ట్రం లో నాణ్యమైన విద్య నందించడానికి అనేక సంస్కరణలను చేపట్టడం జరిగిందని,  విద్య కోసం అమలు చేస్తున్న పధకాలన్నిటినీ ఎస్.డి.జి సూచీలకు మాపింగ్ చేయడం జరిగిందని అన్నారు.    ఎస్.డి.జి సూచీలను నెరవేరిస్తే కొన్ని తరాల వరకు  అభివృద్ధి  చేసిన వారం అవుతామని భావించి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పర్యవేక్షణ చేసేలా డాష్ బోర్డు లను రూపొందించడం జరిగిందని అన్నారు.  జాతి నిర్మాణం లో ఉద్యోగుల పాత్ర కీలకమని, మనసు పెట్టి పని చేస్తే సంతృప్తి మిగులుతుందని హితవు పలికారు.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అందిన స్పందన ఆర్జీలను నిర్ణీత గడువు లోగా పరిష్కరించినందుకు రెండు జిల్లాల కలెక్టర్లను , అధికారులను సెక్రటరీ అభినందించారు. ప్రజల అవసరాలను గుర్తించడం లో, వాటిని సకాలం లో నెరవేర్చడం లో ప్రభుత్వం చిత్త శుద్ధి తో ఉందని అన్నారు.  స్పందన లో వినూత్న మార్పులను తీసుకువచ్చి ప్రజలకు మరింత నాణ్యమైన  సమాధానాలను అందించడానికి కృషి  చేస్తోందన్నారు.  అర్జీదారు సంతృప్తి చెందే వరకు అర్జీ ని పర్యవేక్షించి విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. 

అర్జీ సమాధానం  పంపిన 24 గంటల్లో అర్జీ దారు నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, అర్జీదారు ఫోటో, సమస్య ముందు, తర్వాత ఫోటో ను, అర్జీదారుకు రాసిన సమాధానపు ప్రతిని  సంబంధిత అధికారి అప్లోడ్ చేయాలనీ అన్నారు. మొదటి దశ లోనే అర్జీ ని ట్రాక్ చేయడానికి ఆర్ధికపరమైన, కోర్ట్ లో నున్న అంశాలను గుర్తించేలా ఫార్మటు చేయడం జరిగిందన్నారు.  రీ ఓపెన్ కేసు లను తగ్గించడానికి ఈ నూతన విధానం ఉపకరిస్తుందన్నారు. 

స్పందన విచారణాధికారి అప్లోడ్ చేసేటప్పుడు అర్జీదారు అడిగిన సమాచారాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలనీ స్పష్టం చేసారు.  జిల్లాలో 13 శాతం రీ ఓపెన్ అర్జీ లు ఉన్నాయని, 42 శాతం అర్జీదారులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.  ఎక్కువగా రెవిన్యూ, హౌసింగ్ , సచివాలయ సేవలు, సిబ్బంది పై అర్జీలు అందుతున్నాయని, ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయి లో కూడా ఎందుకు ఎక్కువగా వస్తున్నదీ పరిశీలించాలన్నారు.

ఈ సందర్భంగా  స్పందన  వినతుల పై  సృజన్,  గ్రామ, వార్డ్ వాలంటీర్ ఎస్.డి.జి ల పై అనూషా, క్వాలిటీ ఎడ్యుకేషన్ పై డా. విజయ దుర్గా,  మహిళా అభివృద్ధి పై రోజా రాణి, స్థానిక సంస్థల  ఎస్.డిజి ల కు సంబంధించి ప్రసాద్, పట్టణాభివృద్ధి,  పారిశుధ్యం   పై రావీంద్ర  బాబు తదితరులు  పవర్ పాయింట్ ద్వారా అవగాహన కలిగించారు.

జగనన్న కాలనీ లలో ఇన్ఫ్రా అభివృద్ధి

విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడుతూ హౌసింగ్ కాలనీలలో మౌలిక వసతుల కల్పన లో  జిల్లా ముందుందని తెలిపారు. అదే విధంగా జిల్లాలో ఎస్.డి.జి సూచీలలో మాతా, శిశు మరణాలను తగ్గించగలిగామని తెలిపారు. అయితే రక్త హీనత ఉందని,  తగ్గించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే తినిపించేలా ప్రయత్నం చేస్తున్నామనిఅన్నారు.   ఇప్పటికే కౌమార బాలికల కోసం సఖి బృందాలను ఏర్పాటు చేసి వారికి  ఆరోగ్య పరమైన అంశాల పై అవగాహన కలిగించడం జరుగుతోందని తెలిపారు.  పార్వతీపురం మన్యం  జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ గిరిజన బాలికల్లో రక్త హీనత ఎక్కువగా ఉందని, తగ్గించడానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యకమం లో విజయనగరం  జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్  మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్స్ ఎస్.డి.జి ల పై వివరించిన అంశాలు అత్యంత విలువైనవని, వాటిని గుర్తించి ఎస్.డి.జి సూచీల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.  రెండు జిల్లాల డి.ఆర్.ఓ లు గణపతి రావు, వెంకట రావు, ఆర్.డి.ఓ లు, జిల్లా అధికారులు, తఃసిల్దార్లు, ఎం.పి.డి.ఓ లు ఈ కార్యక్రమం లో  పాల్గొన్నారు.

Related posts

బాగా డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ టిక్కెట్లు

Satyam NEWS

కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రచార వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు

Satyam NEWS

మళ్లీ రాహుల్ గాంధీనే బాధ్యత మోయక తప్పదా?

Satyam NEWS

Leave a Comment