39.2 C
Hyderabad
May 3, 2024 13: 50 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ ఉద్యమం అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డే

chennareddy

తెలంగాణ ఉద్యమానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆద్యుడని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన త్యాగాలను మరచిపోలేమని వక్తలు అన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఆర్సీ కుంతియా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వెంకయ్య నాయుడు చెన్నారెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెన్నారెడ్డి లాంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కావడం మాకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఆర్ సి కుంతియా అన్నారు.

Related posts

కొల్లాపూర్ మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల

Satyam NEWS

విమానాల తయారీ కంపెనీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

Satyam NEWS

సండే స‌ర‌దాగా.. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్

Sub Editor

Leave a Comment