38.2 C
Hyderabad
April 28, 2024 21: 14 PM
Slider మెదక్

సండే స‌ర‌దాగా.. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్

harish rao

సిద్దిపేట స్టేడియంలో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్ధిపేట మినీ ట్యాంక్ బండ్ పై చిన్నారులతో మ్యూజిక్ ప్లే చేస్తూ సరదాగా కాసేపు కలియ తిరిగారు. సండే రోజు సందడిగా సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పర్యాటకుల సందర్శనతో నిండిపోయింది. నిత్యం ఏదో ఒక బిజీతో గడిపే మంత్రి హరీశ్ ఆదివారం కావడం సిద్దిపేటలోని పర్యటనలు, కార్యక్రమాలు ముగించుకుని సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పై కాసేపు కలియ తిరిగారు. పర్యాటకులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.


సిద్ధిపేట మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై టాస్ వేసిన అనంతరం కాసేపు క్రికెట్ ఆటలో భాగంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి, మరో ఓవర్ బౌలింగ్ చేశారు. ఈ మేరకు సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేసి విన్నూత్న షాట్లు కొడుతూ తన బ్యాటింగ్ శైలిని కనబర్చారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్ చేయగా పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేయడం అక్కడి క్రీడాకారులతో పాటు వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Related posts

గుడ్ బిగినింగ్: సిరిసిల్లా లో పట్టణ ప్రగతికి శ్రీకారం

Satyam NEWS

ట్వీట్ పంచ్: మండలి సాక్షిగా బేరసారాలు చేస్తున్నారు

Satyam NEWS

రాజంపేట జిల్లా సాధన కోసం రాజీనామా లు చేస్తామన్న వైసీపీ నేతలు

Satyam NEWS

Leave a Comment