38.2 C
Hyderabad
May 5, 2024 19: 11 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల

kollapur mch

కొల్లాపూర్ పురపాలకకు సంబంధించిన ఓటర్  జాబితాను మునిసిపల్ కమిషనర్ వెంకటయ్య రిలీజ్ చేశారు. సోమవారం ఉదయం పురపాలక కార్యాలయంలో సిబ్బందితో పాటు  కమిషనర్ వెంకటయ్య ఓటర్ లిస్ట్ ను విడుదల చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అంశాలను వివరించారు.

మున్సిపల్ ఓటర్ జాబితా పై ప్రజలకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే రెండవ తేది వరకు తెలియచేయాలన్నారు. పరిశీలించి నాలుగవ తేదీన పూర్తి ఓటర్ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ కు సంబంధించిన అంశాలను తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి చెలించవలసిన నల్ల, ఇంటి పన్ను బకాయి పూర్తి గా చెలించి  ఉండాలన్నారు.

బలపరిచే  ఇద్దరి వ్యక్తులకు కూడా ఈ అంశాలు వర్తిస్తాయన్నారు. 20 వార్డు లకు సంబంధించిన మొత్తం  19478 ఓట్లు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో టౌన్ ప్లానర్ రాజశేఖర్, బిల్ కలెక్టర్ భాస్కర్, భగవాన్, జాఫర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జగన్ గురూజీ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత సేవలు

Satyam NEWS

ఉప్పల్ కాంగ్రెస్ నాయకులకు పదవీ బాధ్యతలు

Satyam NEWS

ఒక్క రోజు దీక్ష: వైఎస్‌ షర్మిల అరెస్టు

Satyam NEWS

Leave a Comment