శ్రీకాకుళం గ్రామీణ మండలం లో పెద్ద పాడు గ్రామం లో పెద్దపాడు ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం ఫిట్ ఇండియా భాగంగా విద్యార్థుల చేత మార్షల్ ఆర్ట్స్, ఏరోబిక్ , యోగ మెడిటేషన్, వ్యాసరచన పోటీలు, మొదలైనవి నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఖచ్చితంగా పై అంశాల్లో బాగా తర్ఫీదు పొందాలని అన్నారు. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పై అంశంలో విద్యార్థులను తర్ఫీదు ఇస్తున్న పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాబు మోహన్ కు ప్రత్యేక అభినందలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సత్యవతి, ఎస్ .వి. కృష్ణారావు, ఎం. శాంతారావు, జి .భూషన్ రావు, డి .యమ్ .మల్లేశ్వరి, కే. సురేష్ కుమార్, క్రాఫ్ట్ బి. త్రివేణి, ఆర్ట్ సిహెచ్. రవికుమార్, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.