25.2 C
Hyderabad
May 8, 2024 07: 20 AM
Slider ప్రత్యేకం

ఏఐసీసీలో భారీ ప్రక్షాళన

massive purge in aicc

 ఏఐసీసీలో భారీ ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.  అనంతరం కాంగ్రెస్‌లో పలు మార్పులు చోటుచేసుకొనున్నట్లు తెలుస్తోంధి.  అందులో భాగంగానే జి 23 నేతల కు పార్టీ పరంగా ఉన్నత పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల్లో ఆజాద్‌ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు

. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. అయితే  ఈ ఏడాది చివరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే ముందస్తుగానే కాంగ్రెస్ పెద్దలు సన్నద్దమ్ అవుతున్నట్లు తెలుస్తున్నది.

మరోవైపు కర్నాటక ఎన్నికల తర్వాత ఆజాద్‌కు అక్కడి నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మను కూడా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడుగా ఉన్న మనీష్ తివారీకి ఏఐసీసీలో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సుముఖత చూపించారు.

కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, హుడా  ప్రస్తుత హర్యానా పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు.  మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ని గాడిలో పడేసేందుకు సోనియా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

Related posts

వినియోగదారులు అవగాహన పెంచుకోవాలి

Satyam NEWS

మహిళలను ప్రోత్సహించడంలో పురుషులకు సమానమైన పాత్ర

Satyam NEWS

చూడముచ్చటగా ఉన్న దుర్గం చెర్వు కేబుల్ వంతెన

Satyam NEWS

Leave a Comment