33.7 C
Hyderabad
April 27, 2024 23: 47 PM
Slider హైదరాబాద్

చూడముచ్చటగా ఉన్న దుర్గం చెర్వు కేబుల్ వంతెన

Minister Talasani Srinivasayadav

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరం సిగలో మరో అద్బుత నిర్మాణం చేరిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  ఆదివారం హై టెక్ సిటీ లోని దుర్గం చెరువు పై 184 కోట్ల రూపాయల తో  నిర్మించిన కేబుల్ వంతెనను ఆయన సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద కేబుల్ వంతెనలలో దుర్గం చెరువు కేబుల్ వంతెన ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, రానున్న రోజులలో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

యువనేత, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కృషితోనే ఈ వంతెన నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

ఈ వంతెన ప్రారంభం అయితే మైండ్ స్పేస్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులకు సుమారు 2.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, ట్రాపిక్ రద్దీ సమస్య కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. మంత్రికి ఈ కేబుల్ వంతెన విశేషాలను  L & T ప్రాజెక్ట్ మేనేజర్ అజయ్ వివరించారు.

Related posts

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు కేసీఆర్ శుభాకాంక్షలు

Satyam NEWS

బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టండి: సిఐటియు

Satyam NEWS

విశాఖపట్నమే రాజధాని: సీఎం జగన్ వెల్లడి

Satyam NEWS

Leave a Comment