38.2 C
Hyderabad
May 1, 2024 21: 58 PM
Slider ప్రత్యేకం

15 నిమిషాలు ఆలస్యమైనా ప్రాక్టికల్స్ కు అనుమతి

15 minutes late practicals allowed

రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్ష లకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్ బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు చదివే కళాశాలల్లోనే రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు జరుపుతారు.

ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారితో పాటు  27-30 మార్కులు వచ్చిన వారి జవాబుప త్రాలను కూడా తాము మరోసారి పునఃపరిశీలన చేస్తా మని స్పష్టం చేశారు. ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయకుంటే ఆ కళా శాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలకు రూ.5 వేల జరి మానా విధిస్తామని హెచ్చరించారు.

విద్యార్థులకు ఎగ్జా మినర్లు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటల లోపు ఆన్లైన్లో బోర్డుకు పంపాలి. జాగ్రఫీ విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఆదివారం నుంచి ఆన్లైన్లో ప్రాక్టికల్ పరీక్షల హల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డ్ పేర్కొంది.

Related posts

జగదీష్ మృతిపట్ల మంత్రి పువ్వాడ సంతాపం

Bhavani

పట్టభద్రులకు అండగా డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

Satyam NEWS

కొల్లాపూర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment