38.2 C
Hyderabad
April 29, 2024 11: 02 AM
Slider నిజామాబాద్

Master Plan farmers: 20 వ తేదీన ఎమ్మెల్యే ఇంటి ముట్టడి

#kamareddy

ఈ నెల 20 వ తేదీన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి రైతు ఐక్య కార్యాచరణ నిర్ణయించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గత 45 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు నేడు పాత రాజంపేట గ్రామంలో కీలక సమావేశం నిర్ణయించారు. 8 గ్రామాల రైతులు పాల్గొన్న ఈ సమావేశంలో సుమారు 3 గంటల పాటు భవిష్యత్ కార్యాచరణపై సిదీర్ఘంగా చర్చించారు. అనంతరం చర్చలో నిర్ణయించిన కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం విలీన గ్రామాల కౌన్సిలర్లు ఈ నెల 20 వ తేదీ లోపు రాజీనామా చేయాలని, తద్వారా రైతులకు మద్దతు పలకాలని ఈ నెల 12 న లింగాపూర్ గ్రామంలో జరుగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు. ఆ తిర్మణాన్ని అనుసరిస్తూ ఈ నెల్ 19 మధ్యాహ్నం 3 గంటల లోపు విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి నిర్ణయం

కౌన్సిలర్ల రాజీనామాకు మరోసారి డెడ్ లైన్ విధించిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వ తేదీ లోపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించి 19 వ తేదీ మధ్యాహ్నం లోపు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టాలని, ఆ తీర్మానం కాపీ రైతులకు అందించాలన్నారు. అలా చేస్తే 8 గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేస్తారని తెలిపారు. లేకపోతే 20 వ తేదీ 8 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గంప ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ రోజు రైతులు ఉదయమే ఎమ్మెల్యే ఇంటికి చేరుకోవాలన్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా, కేసులు పెట్టినా, లాఠీలతో కొట్టినా ముట్టడి ఆపేది లేదని స్పష్టం చేశారు.

బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా

రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు రైతుల సమక్షంలో రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 2 వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి, 11 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ తమ రాజీనామా లేఖలను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులకు అందజేశారు. రైతుల కంటే తమకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు. కౌన్సిల్ సమావేశం రోజు తమకు తెలియకుండానే మాస్టర్ ప్లాన్ పై తీర్మానం చేసారని పేర్కొన్నారు. రైతుల పోరాటానికి తాము అండగా ఉంటామని, మాస్టర్ ప్లాన్ రద్దయ్యేవరకు రైతులతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.

Related posts

Vijayanagaram Police: రెండున్నర గంటలు…45 ఫిర్యాదులు…

Satyam NEWS

రాష్ట్ర విభజన కంటే రాజధాని మార్పు పెద్ద అన్యాయం

Satyam NEWS

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి

Bhavani

Leave a Comment