31.7 C
Hyderabad
May 7, 2024 01: 54 AM
Slider ఆధ్యాత్మికం

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సమావేశం

#mittapally

శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం ప్రముఖ త్రిశక్తి చండీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలో సుమారు 60 సంవత్సరాల క్రితం ఏర్పాటై 1983 నుండి నిత్యాన్నదాన సత్రంగా రూపుదిద్దుకొని పుణ్యక్షేత్రానికి వచ్చే బ్రాహ్మణ యాత్రికులకు లేదనకుండా అన్నదానం,ఉన్నంతలో వసతి సౌకర్యాలు కల్పిస్తూ,శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంది.

ఈ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం పురాతనమై,పెద్ద సంఖ్యలో వచ్చే బ్రాహ్మణ బంధువులకు అధునాతన సౌకర్య,వసతి కల్పించటం కొరకు,నూతన భవన ఏర్పాటు,అధునాతన సౌకర్యాలతో యాత్రికులకు సేవ చేయాలనే సంకల్పంతో క్రొత్త భవన నిర్మాణం చేపట్టటం కొరకు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

కార్యవర్గ సమావేశంలో పుణ్య క్షేత్రానికి వచ్చే బ్రాహ్మణ యాత్రికుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు,పాలక కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ త్రిశక్తి చండీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ,సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్ష్య,కార్యదర్శులు చెన్నూరి మట్టపల్లి రావు,కోశాధికారి బాచిమంచి గిరిబాబు,ఉపాధ్యక్షుడు పుల్లాభొట్ల శివ, రంగరాజు వాసుదేవరావు,పులిజాల పుష్ప, భువనగిరి శ్యామ్ సుందర్,ధూళిపాళ రామకృష్ణ ప్రసాద్,అన్నంభొట్ల ఫణి శర్మ, రాయప్రోలు శ్రీరామయ్య శర్మ,నారపరాజు నర్సింహారావు,చెన్నూరి శ్రీకాంత్, నారపరాజు శేషగిరిరావు,హరి లక్ష్మణ కుమార్,యలమంచి మురళీకృష్ణ,కిరణ్ కుమార్,బాచిమంచి రామకృష్ణ శాస్త్రి, వెంకటనారాయణ,రమేష్,నారపరాజు రామారావు,పులిజాల శంకర రావు, టి.ఎస్.ఎన్.ప్రసాద్,బాచిమంచి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నకిలీ విత్తనాల పేరుతో రైతులు ఆగం

Satyam NEWS

కేసీఆర్ పుట్టిన రోజుకు రెండున్నర లక్షల మొక్కలు

Satyam NEWS

సమాజ శ్రేయస్సు పరమావధి కావాలి

Sub Editor

Leave a Comment